900 ఏళ్ల నాటి బంగారు నాణేలు, ఇయర్ రింగ్స్ బయటపడ్డాయ్!

-

ఇప్పటిది కాదు.. 900 ఏళ్ల నాటి కుండ అది. ఆ కుండ ఇప్పుడు బయటపడింది. దాంట్లో ఏముందా అని చూసి షాకయ్యారు అక్కడి వాళ్లు ఎందుకంటే అందులో బంగారు నాణేలు, ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఈ ఘటన ఇజ్రాయెల్ లోని కేసరియాలో చోటు చేసుకున్నది.

తవ్వకాల్లో బయటపడ్డ ఆ బంగారు నాణేలను పరిశీలించిన పరిశోధకులు.. అవి.. 11 వ శతాబ్దానికి చెందినవిగా గుర్తించారు. క్రుసేడుల కాలానికి చెందినవిగా గుర్తించారు. మొత్తం 24 బంగారు నాణేలు, చెవి రింగుల జత ఆ కుండలో దొరికింది. అప్పట్లో ఈ పట్టణాన్ని ధ్వంసం చేసి ప్రజలను ఊచ కోత కోశారు. ఆ బంగారం యజమానులను కూడా చంపి ఉండొచ్చని.. అందుకే వాళ్లు మళ్లీ ఈ బంగారాన్ని తవ్వి తీసుకోలేకపోయారని.. అందుకే అది 900 ఏళ్లుగా అలాగే మట్టిలోనే ఉండిపోయిందని పరిశోధకులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version