ఆన్‌లైన్‌లో సమోసాలు ఆర్డర్‌ చేస్తూ సైబర్‌ మోసానికి గురైన డాక్టర్‌.. రూ. 1. 40 లక్షలు స్వాహా

-

ఇప్పుడు కర్‌చీప్‌ నుంచి కాసులపేరు వరకూ ఏది కొన్నా ఆన్‌లైన్‌లోనే అవుతుంది. యూపీఐ ఐడి లేదా క్రెడిట్‌ కార్డు ఇచ్చేయడమే.. అసలు డబ్బులు ఇచ్చే వాళ్లే తక్కువ అయ్యారు. కానీ ఇదే తరుణంలో మోసాలు కూడా అంతే స్థాయిలో పెరిగిపోయాయి. పేమెంట్స్‌ చేసేప్పుడు ఎన్నో రకాల ఫ్రాండ్స్‌ జరుగుతున్నాయి. వాటి భారిన పడకుండా ఉండాలంటే.. మనం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. లేదంటే అస్సామే.! ఇటీవల ఒక డాక్టర్‌ సమోసాలు ఆర్డర్‌ చేస్తూ ఆన్‌లైన్‌ మోసానికి గురై 1. 40 లక్షలు పోగొట్టుకున్నాడు.

ముంబైకి చెందిన 27 ఏళ్ల డాక్టర్, పిక్నిక్ కోసం సమోసాలు ఆర్డర్ చేస్తూ మోసానికి గురై రూ.1.40 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ స్కామ్ ఎలా జరిగిందో తెలుసుకుందాం. బాధితుడు సహోద్యోగులతో కలిసి కర్జాత్‌లో పిక్నిక్ ప్లాన్ చేశారు. ప్రయాణానికి సమోసాలు ఆర్డర్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేసి తినుబండారాలను విక్రయించే పాపులర్‌ ప్లేస్‌ కాంటాక్ట్‌ నంబర్‌ తెలుసుకున్నారు. సమోసాలు ఆర్డర్‌ చేసేందుకు కాల్ చేశారు. ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి.. 25 ప్లేట్స్‌ సమోసాలకు రూ.1500 అడ్వాన్స్ చెల్లించాలని డాక్టర్‌ని కోరాడు. బాధితుడికి వాట్సాప్‌లో ఆన్‌లైన్ పేమెంట్‌ కోసం బ్యాంక్ అకౌంట్‌ నంబర్‌ సహా కన్‌ఫర్మేషన్‌ మెసేజ్‌ వచ్చింది. ఈ ప్రాసెస్‌ను నమ్మిన డాక్టర్‌, స్కామర్లు ఇచ్చిన అకౌంట్‌ నంబర్‌కు రూ.1500 ట్రాన్స్‌ఫర్‌ చేశాడు.

అవతలి వ్యక్తి పేమెంట్‌ కోసం ట్రాన్సాక్షన్‌ ఐడీని క్రియేట్‌ చేయమని వైద్యుడికి సూచించడంతో ఇది నమ్మిన డాక్టర్‌, స్కామర్ చెప్పిన ప్రాసెస్‌ ఫాలో అవుతూ మొత్తం రూ.1.40 లక్షలను పోగొట్టుకున్నాడు. ఈ ఘటన గతవారం ఉదయం 8:30 నుంచి 10:30 గంటల మధ్య జరిగింది. బాధితులు భోయివాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

మోసాలకు చెక్ పెట్టే సేఫ్టీ టిప్స్

ఆన్‌లైన్ కొనుగోళ్లు చేయడానికి లేదా పర్సనల్ డేటా షేర్‌ చేయడానికి ముందు, వెబ్‌సైట్ అథెంటిసిటీని నిర్ధారించుకోవాలి. గూగుల్‌లో ఉండే కాంటాక్ట్ డీటేల్స్ నమ్మకూడదు. సురక్షిత కనెక్షన్‌ల కోసం (https://) చూడాలి, కాంటాక్ట్‌ ఇన్‌ఫర్మేషన్‌ చెక్‌ చేయాలి. ఇతర వినియోగదారుల రివ్యూలు, ఫీడ్‌బ్యాక్‌లు చదవాలి. అసలు కష్టమర్‌ కేర్‌ నెంబర్లు, ఇలాంటి అడ్రస్‌లు గూగుల్‌లో చూసి కాంటాక్ట్‌ అవకూడదు.

వ్యక్తిగత సమాచారం, ఆర్థిక వివరాలను కోరుతూ, వెంటనే స్పందించాలని చెబుతూ సెండ్‌ చేసిన ఇమెయిల్స్‌ నమ్మకూడదు. తెలియని సోర్సెస్‌ నుంచి వచ్చిన లింక్‌లపై క్లిక్‌ చేయకూడదు, అందులో ఉన్న ఎలాంటి ఫైల్స్‌ డౌన్‌లోడ్‌ చేయకూడదు.

సోషల్ సెక్యూరిటీ నంబర్‌లు లేదా బ్యాంక్ అకౌంట్‌ వివరాల వంటి సున్నితమైన పర్సనల్‌ డేటాను ఎవ్వరికీ షేర్‌ చేయకూడదు.

తాజా ఆన్‌లైన్ స్కామ్‌లు, మోసాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. ఇన్వెస్ట్‌మెంట్‌ స్కీమ్‌లు, లాటరీ లేదా ప్రైజ్ స్కామ్‌లు, రొమాన్స్ స్కామ్‌లు, టెక్ సపోర్ట్ స్కామ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వార్నింగ్‌ సైన్స్‌, రెడ్‌ ఫ్లాగ్స్‌పై అవగాహన పెంచుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news