ప్రేమించిన వ్యక్తి కోసం.. 2 వేల కోట్లకు పైగా ఆస్తిని వదిలేసుకున్న యువతి

-

బేబీ సినిమా రిలీజ్‌ అయినప్పటి నుంచి.. చాలా మందికి నిజంగానే ఈ భూమ్మీద నిజమైన ప్రేమ దొరకదా.., అందరూ ఇంతేనా అనే ఫీలింగ్‌ బాగా పెరిగింది. ఏ అబ్బాయిని కదిలించినా నాకు ఇలానే జరిగింది భయ్యా అంటూ సినిమా హాల్లోనే ఏడ్చేస్తున్నారు. మొన్ననే సేమ్‌ బేబీ సినిమాలో జరిగినట్లే రియల్‌ లైఫ్‌లో జరిగింది. ఆ అమ్మాయి చివరకి సూసైడ్‌ చేసుకుంది. ప్రేమ అనేది అసలు లేదు. కేవలం టైమ్‌ పాస్‌కు, మనీకి మధ్య జరిగే డ్రామానే ఈ ప్రేమ అని చాలా మంది ఫిక్స్‌ అయిపోయారు. ఇలాంటి తరుణంలో.. గంజాయి వనంలో తులసి మొక్కలా.. ఒక స్వచ్ఛమైన నిజాయితి ఉన్న లవ్‌ స్టోరీ బయటకు వచ్చింది. ప్రేమించిన వారి కోసం ఖండాలు దాటి వచ్చిన వాళ్లను చూసి ఉంటారు. ఒక సామాన్య వ్యక్తిని ప్రేమించి అతని కోసం వేల కోట్ల ఆస్తిని కాదనుకోని వచ్చిందో యువతి..! ప్రేమ అనే ఒక బంధం కోసం కన్నవాళ్లను వదిలేసుకుంది. ఈ ట్రూ లవ్‌ స్టోరీపై మీరూ ఓ లుక్కేయండి.!

మలేసియాకు చెందిన ఏంజెలినా ఫ్రాన్సిస్‌ (Angeline Francis Khoo).. ప్రముఖ వ్యాపారవేత్త ఖూ కే పెంగ్‌, మాజీ మిస్‌ మలేసియా పాలైన్‌ ఛాయ్‌ దంపతుల కుమార్తె. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో చదువుకుంటున్న సమయంలో జెడియా అనే స్నేహితుడితో ప్రేమలో పడింది. వివాహం చేసుకునేందుకు సిద్ధమైన ఆమె.. ఇదే విషయాన్ని వారి తల్లిదండ్రులకు చెప్పింది. వారు అందుకు నిరాకరించారు. ఆర్థికపరంగా ఇరు కుటుంబాల్లో భారీ తేడా ఉందన్న వారు.. అతడిని దూరం కావడమో లేదా వారసత్వాన్ని వదులుకోవడమో చేయాలని ఆదేశించారు. చివరకు ప్రియుడితోనే స్థిరపడాలని నిశ్చయించుకున్న ఆమె.. ఇంటినుంచి బయటకు వెళ్లిపోయింది. 2008లో వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో వారసత్వంగా వచ్చే సుమారు రూ.2వేల కోట్ల ఆస్తిని వదులుకుంది.

వివాహం అనంతరం ఇద్దరు కూడా వారి రెండు కుటుంబాలకు దూరంగానే ఉన్నారు. అయితే, చాలా రోజులు దూరంగా ఉన్న ఫ్రాన్సిస్‌.. ఓసారి వారి తల్లి దండ్రులను కలవాల్సి వచ్చింది. ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడమే అందుకు కారణం. న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చేందుకు ఫ్రాన్సిస్‌ కోర్టుకు వెళ్లింది. ఈ క్రమంలో తన తల్లి గురించి గొప్పగా వివరించిన ఆమె.. కుటుంబం కోసం ఆమె చేసిన సేవలను కొనియాడింది. తండ్రిపై మాత్రం విమర్శలు చేసింది. ఏదేమైనా తల్లిదండ్రులిద్దరూ తిరిగి కలుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నానని చెప్పిన ఆమె ప్రేమ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news