ఈ చెట్టు కలప కిలో రూ. 7 లక్షలట.. ఇక మొత్తం చెట్టునే అమ్మితే…

-

ఎర్రచందనం చాలా ఖరీదైన కలప అని మనకు తెలుసు. అమ్మితే లక్షల్లోనే వస్తుంది. అంతకంటే ఖరీదైన కలప గురించి మీకు తెలుసా..? ఆ చెట్టు కలప కిలో 7లక్షలు. ఇక చెట్టు అమ్మితే వచ్చే డబ్బుతో లైఫ్‌ సెట్‌ అయిపోతుంది. ఈ చెట్టు పేరు ఆఫ్రికన్ బ్లాక్‌ వుడ్‌ చెట్టు.

ఈ చెట్టుల ఎక్కువగా ఆఫ్రికన్ కంట్రీలోని పొడిగా ఉండే ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఈ చెట్టు ఒక కేజీ చెక్క ధర 7 లక్షలు ఉంటుంది. అరుదుగా లభించే ఈ కలపనిచ్చే చెట్టు సుమారు 1 క్వింటా బరువు ఉంటుంది. ఈ కోణంలో చూస్తే ఒక్క చెట్టు ధర 7 కోట్లకు పైనే ఉంటుంది. షెహనాయ్, ఫ్లూట్, గిటార్ వంటి సంగీత వాయిద్యాలను తయారు చేయడానికి ఈ కలపను ఉపయోగిస్తారు. అంతే కాదు ఈ చెక్కను ఫర్నీచర్ తయారీకి కూడా ఉపయోగిస్తారు. అయితే దీనితో తయారైన ఫర్నీచర్ ఖరీదు ఎక్కువ కాబట్టి బాగా సౌండ్ పార్టీసే వాడుతుంటారు.

గంధపు చెక్కల మాదిరిగానే ఇది కూడా అరుదుగా ఉండటంతో విపరీతంగా రవాణా అవుతుంది. చెట్లు భారీ వృక్షాలుగా ఎదగక ముందే స్మగ్లర్లు నరికివేస్తున్నారు. ఈ చెట్టు పూర్తిగా ఎదగడానికి 60 సంవత్సరాలు పడుతుంది. అంతకుముందే స్మగ్లర్లు దానిని నరికి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ఇలా వేగంగా చెట్లను నరికివేయడం వల్ల వాటి సంఖ్య తగ్గి వాటి విలువ మరింత పెరుగుతుంది.

ఆఫ్రికన్ బ్లాక్‌వుడ్‌ను రక్షించడానికి టాంజానియా వంటి దేశాలలో సాయుధ బలగాలు కూడా ఉంటాయట.. వారి భద్రతపై ఖర్చు కూడా పెద్ద మొత్తంలోనే ఉంటుంది. దీని కారణంగా ప్రజలు వాటిని పెంచడం మానేస్తున్నారు. ఈ చెట్లు చాలా అరుదుగా పెరుగాయి. అయితే మనకు ఇంట్రస్ట్‌ ఉంటే ఇవి మన దేశంలో కూడా పెంచుకోవచ్చు. దీనిని భారతదేశంలో నార్త్ ఇండియన్ రోజ్‌వుడ్ అని పిలుస్తారు. అయినప్పటికీ, ప్రజలు దానిని పెంచడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఈ చెట్లను వృక్షాలుగా మారేవరకు వాటి సంరక్షణకు పెట్టే ఖర్చు భరించగలగడం కష్టం.

Read more RELATED
Recommended to you

Latest news