ఇతర జెండాలను ఎగరేస్తే పౌరసత్వాన్ని రద్దు చేస్తాం-సీఎం యోగి

-

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ సంచలన ప్రకటన చేశారు. దేశ రాజకీయాలు హిందువుల చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో ఆయన చేసిన ప్రకటన ప్రత్యేకతను సంతరించుకుంది. అనుమతి లేకుండా ఉత్తర ప్రదేశ్లో ఏ దేశ జెండా అయినా ఎగరకూడదని ప్రకటించారు.ఒకవేళ ఎవరైనా నియమాలను ఉల్లంఘించి ఇతర జెండాలను ఎగురవేస్తే వారి పౌరసత్వాన్ని రద్దు చేస్తామని కఠినంగా హెచ్చరించారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఈ మాట అనడానికి చాలా ధైర్యం కావాలి. అయితే యోగి ఈ ప్రకటన చేయడానికి ఓ కారణం కూడా ఉంది. ఈ మధ్య హిందువుల ఆలయాలను ధ్వంసం చేయడం,ధార్మిక యాత్రలకు వెళ్తున్న భక్త బృందాలపై అకారణంగా దాడులు చేయడం లాంటి సంఘటనలు పెరుగుతున్నాయి. నుహ్ ఉన్మాదులు మన మధ్యలోనే స్థావరాలను ఏర్పాటు చేసుకుని అల్లర్లకు కుట్రలు చేస్తున్నారు.అలాంటి వారిపై బుల్డోజర్ బాబా మార్క్ యాక్షన్ ప్లాన్ అమలు చేసేందుకు యోగి మరోసారి సిద్ధమయ్యారు.

ఇటీవల ఇంకోమాట కూడా యోగి తరచు అంటున్నారు. అది….హుండీలో డబ్బులు వేయడం మంచిదే అలాగే దేశం కోసం ఓటు వేయడం కూడా నేర్చుకోండి అని. ఓ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో విద్యార్థులనుద్దేశించి వారి బాధ్యతను గుర్తు చేస్తూ సీఎం యోగి ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ ప్రకటన యూపీలోని యువతలో మంచి మార్పును తీసుకువచ్చింది. విద్యార్థులు వారి గ్రామాల్లో ఓటు నమోదుపై విస్తృత ప్రచారం కల్పించి కొత్త ఓట్లను నమోదు చేయించారు.రానున్న ఎన్నికల్లో మంచి నేతను ఎన్నుకోవాలని ఓటర్లకు సూచించారు.దేశం పట్ల బాధ్యత కలిగిన యోగిలాంటి వ్యక్తి పిలుపు యువతలో మార్పు తీసుకువస్తుంది అనేందుకు ఇది ఒక ఉదాహరణ.

ఒక వారం క్రితం ఇండోనేషియా లో రామాయణం నాటకాన్ని ప్రదర్శించారు. ఇండోనేషియా ఒక ముస్లిం దేశం. అక్కడ ఓ ముస్లిం విద్యాసంస్థ వార్షికోత్సవ వేడుకలకు సీఎం యోగీని ముఖ్య అతిధిగా ఆహ్వానించగా అదిత్యనాథ్ వెళ్లారు. అక్కడి విద్యార్థులు,అధ్యాపకులు రామాయణంలో ని పాత్రలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమం సీఎం యోగిని అమితంగా ఆకట్టుకుంది. నాటకం అనంతరం యోగి మాట్లాడుతూ మీది ముస్లిం దేశం కదా… రామాయణం ,అందులోని పాత్రలను అంత చక్కగా ఎలా చేయగలిగారు అని అక్కడివారిని ప్రశ్నించగా రాముడు సీత మా పూర్వీకులని వారు బదులిచ్చారు.ఈ సమాధానం యోగీ ని పొంగిపోయేలా చేసిందని యూపీలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం చెప్పారు.ఇతర దేశాలు మన సంస్కృతిని గౌరవిస్తున్నాయని, కులాలను పక్కనపెట్టి అందరూ హిందు అనే పదానికి కట్టుబడాలని పిలుపునిచ్చారు.ఇక యోగీ చేస్తున్న కార్యక్రమాలు, తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ఇలాంటి సీఎం మాకు కావాలి అని దేశంలోని చాలా రాష్ట్రాల ప్రజలు ఆశిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news