ప్రస్తుతం ప్లాస్టిక్ ప్రాణాలను తీసివెస్తుంది..ఆరోగ్య సమస్యలతో పాటు,పర్యావరణాన్ని కూడా కాలుష్యం చేస్తుంది.ఈ మేరకు ప్లాస్టిక్ నిషేధం పై ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.జూలై ఒకటి నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ ప్రారంభమైంది. చిన్నచిన్న ఇయర్ బడ్స్ నుంచి చేతి సంచుల వరకూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లో ఉన్నాయి. అందుకనే నిన్నటినుండి వాటిని బ్యాన్ చేశారు..ఇక వీటి ప్లేసులో డిఆర్డీఒ అద్భుత ఆవిష్కరణ చేసింది.ప్లాస్టిక్ కు బదులు బయో ప్లాస్టిక్ కు రూపకల్పన జరిగింది..
డిఆర్డీఒ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ వీరబ్రహ్మం ఏడాదిపాటు పరిశోధన చేసి, ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా బయోప్లాస్టిక్ ను రూపొందించారు. మొక్కజొన్నతో ఈ బయో ప్లాస్టిక్ ను రూపిందించడం జరిగింది. ఈ బయో ప్లాస్టిక్ తో ముందుగా చేతి సంచులను తయారు చేశారు. ఒక ట్రయల్ బేస్ గా తిరుమల తిరుపతిలో బయో ప్లాస్టిక్ సంచుల వినియోగం ప్రారంభించామని, ఇవి మంచి ఫలితాలను ఇస్తున్నాయంటున్నారు. మొక్కజొన్నతో తయారుచేసిన ఈ బయో ప్లాస్టిక్ వల్ల ఎలాంటి హానీ లేదని నెల రోజుల్లో భూమిలో, నీటిలో ఇది ఎరువుగా మారిపోతుందని అన్నారు.
వీటిని తయారు చెయ్యడానికి ప్రత్యేక యంత్రాలు అవసరం లేదు..ప్లాస్టిక్ తయారు చేస్తున్న వాటి పై సులువుగా చెయ్యవచ్చు.ప్లాస్టిక్ సంచులు తయారు చేస్తున్న ఫ్యాక్టరీలోనే చిన్న చిన్న మార్పులతో బయో ప్లాస్టిక్ ఉత్పత్తి జరిగిపోతుందని అంటున్నారు. దీనికోసం ఇప్పటికే.. 20కి పైగా కంపెనీలు ముందుకు వచ్చాయని, వీటికి ఈ టెక్నాలజీని ఉచితంగా డిఆర్డీఒ అందిస్తుంది.ప్రస్తుతం వీటి ఆవిష్కరణ పై ప్రభుత్వాలు దృష్టి సారించాయి. కొద్ది రోజుల్లో ఆ ప్రోడక్ట్స్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు.