సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ నేమ్ ప్లేట్

-

ప్రస్తుతం ఏపీ సీఎం ఎవరు అంటే చంద్రబాబు అంటాం. కానీ.. ఇక చంద్రబాబు అంత సీను లేదట. ఏపీకి కాబోయే సీఎం జగన్ అని అందరూ కన్ఫమ్ అయిపోయారు. దానికి ఉదాహరణే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ నేమ్ ప్లేట్

ఏపీలో ఎన్నికలు జరిగాయి కానీ ఇంకా ఫలితాలు రాలేదు. మే 23న అన్ని విడతల ఎన్నికలు అయిపోయాక ఫలితాలు వెలువడనున్నాయి. అప్పటి వరకు ఎవరిది గెలుపు? ఎవరిది ఓటమి? అనే విషయాలను ఊహించుకోవడం తప్పించి ఇంకేం చేయడానికి ఉండదు. తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరుతో ఉన్న నేమ్ ప్లేట్ ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.

దాన్ని ఎవరు చేయించారు? అప్పుడే ఎందుకు చేయించారు? ఈసారి జగనే ఖచ్చితంగా గెలుస్తారని వాళ్లకు ఎలా తెలుసు? జగన్ గెలుస్తారని ముందే తెలిసిపోయిందా? అందుకే ముందే సీఎం పేరుతో ఆయన నేమ్ ప్లేట్‌ను తయారు చేయించారా? అనే విషయాలు తెలియనప్పటికీ.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ఆహా.. ఆయన పేరు ముందు సీఎం అనే ట్యాగ్‌లైన్ ఎంత బాగుంది.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎస్. ఇకనుంచి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డీయే అంటూ నొక్కి చెబుతున్నారు నెటిజన్లు. ఎవరు చేయించారో కానీ.. కరెక్ట్‌గానే చేయించారు. వాళ్ల కష్టం వృథా కాదు అంటూ రకరకాలుగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version