పెళ్లి తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా జీవించాలని కలకాలం కలిసి ఉండాలని అనుకుంటూ ఉంటారు. పైగా పెళ్లి కుదరని వాళ్ళు పెళ్లి అయితే ఇలా ఉండాలి అలా ఉండాలని కలలు కంటూ ఉంటారు. వైవాహిక జీవితంలో ఆనందం ఉండాలన్నా భార్యాభర్తలు కలకాలం కలిసి ఉండాలన్నా ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం మొదట్లో వచ్చే సమస్యల్ని పరిష్కరించుకుంటూ వెళ్తే జీవిత భాగస్వామితో కలకాలం ఆనందంగా ఉండొచ్చు. కానీ భార్యాభర్తల మధ్య మొదట్లోనే ఇటువంటి సంకేతాలు కనపడితే కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి.
సాధారణంగా ఏ జంటలో కూడా అభిప్రాయాలు ఒకేలా ఉండవు చాలా అరుదుగా అభిప్రాయాలు కలుస్తూ ఉంటాయి. అయితే ఎవరిది ఏ అభిప్రాయం అయినా కూడా మరొకరు ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. కాబట్టి మొదట్లోనే ఒక అండర్స్టాండింగ్ కి వచ్చేయాలి అలాకాకుండా ఆస్తమాను సమస్యలు కలుగుతున్నట్లయితే మొదట్లోనే పరిష్కరించుకోవాలి లేదంటే రోజురోజుకీ కష్టమవుతుంది.
అతిగా అంచనాలు పెట్టుకోకూడదు కూడా ఒకరి మీద ఒకరు అంచనాలు ఎక్కువ పెట్టుకోవడం వలన తర్వాత ఇబ్బంది పడాల్సి ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండడం మంచిది. కొంతమంది వాళ్ళ స్నేహితులతో మాట్లాడుతుంటారు వాళ్ళని అస్తమను కలుస్తూ ఉంటారు. అది జీవిత భాగస్వామికి నచ్చకపోవచ్చు ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే మొదట్లోనే జీవిత భాగస్వామితో కూర్చుని మాట్లాడుకోవాలి లేదంటే భవిష్యత్తులో సమస్యలు కలుగవచ్చు. అలానే భార్యాభర్తలకు ఎప్పుడూ కూడా ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి ఒకరికి మీద ఒకరికి సందేహాలు ఉండకూడదు ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవాలి. ఒకవేళ కనుక ఇటువంటివి మొదట్లో ఉన్న ఉన్నట్లయితే వీలైనంత త్వరగా సాల్వ్ చేసుకోండి లేదంటే డేంజర్ ఏ.