బీఆర్ఎస్‌లో బిగ్ ట్విస్ట్..మ్యాజిక్ ఫిగర్‌కు దగ్గరలో.!

-

ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలనేది కేసీఆర్ ఆశ. తెలంగాణ ఏర్పాడ్డాక..తెలంగాణ తెచ్చిన పార్టీగా రెండుసార్లు బి‌ఆర్‌ఎస్ పార్టీకి అధికారం అప్పగించారు. ఇక రెండు సార్లు అధికారంలోకి వచ్చి 70 ఏళ్ల పాలనలో జరగని అద్భుతాలని 9 ఏళ్లలోనే చేశామని కే‌సి‌ఆర్ అంటున్నారు. తెలంగాణని ప్రగతిపథంలో నడిపించామని చెబుతున్నారు. అద్భుతమైన సంక్షేమం, అభివృద్ధి చేశామని అంటున్నారు.

అయితే మరి ఈ అంశాలపై ప్రజలు ఏం అనుకుంటున్నారనేది పూర్తిగా క్లారిటీ రావడం లేదు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక ప్రగతి పథంలో వెళ్లామని కొందరు భావిస్తే..కొందరు మాత్రం ఇంకా వెనుకపడ్డామని, దేనికోసం ఉద్యమం జరిగిందో అందులో ప్రధానంగా ఉద్యోగాలు పెద్దగా ఇవ్వలేదని, యువతకు అన్యాయం జరిగిందని, అలాగే తెలంగాణ పోరాటంలో ఉన్న నేతలని తప్పించి..పోరాటం లేని నేతలే ఇప్పుడు బి‌ఆర్‌ఎస్ లో ఉన్నారనే విమర్శలు ఉన్నాయి. అంటే మొత్తానికి 10 ఏళ్ల తెలంగాణలో కే‌సి‌ఆర్ పాలన పై మిక్సడ్ టాక్ ఉంది.

అదే సమయంలో తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఉన్న కాంగ్రెస్ పుంజుకుంటుంది. తమకు ఒక అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇటు కేంద్రంలో అధికారంలో బి‌జే‌పి సైతం రేసులో ఉంది. దీంతో ఈ సారి ఎన్నికలో హోరాహోరీగా మాత్రం జరగడం ఖాయమని చెప్పవచ్చు. అందులో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే ఎవరు గెలుస్తారనేది, అసలు ప్రజా నాడీ ఎలా ఉందననేది క్లియర్ గా తెలియడం లేదు.

అయితే ఇప్పుడు రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం..బి‌ఆర్‌ఎస్ పార్టీనే ఆధిక్యంలో ఉందని తెలుస్తుంది. కాకపోతే మ్యాజిక్ ఫిగర్ 60 సీట్లకు దగ్గరలో ఉందని, 60 సీట్లు దాటి గెలుచుకోవాలంటే ఇంకా పార్టీ బలపడాలని అంటున్నారు. కాంగ్రెస్ బలం ఎంత తగ్గితే అంతగా బి‌ఆర్‌ఎస్ గెలుపు సులువు అవుతుందని చెబుతున్నారు. చూడాలి మరి బి‌ఆర్‌ఎస్ హ్యాట్రిక్ కొడుతుందో లేదో.

Read more RELATED
Recommended to you

Latest news