కుర్చీలో కుర్చున్నప్పుడు మీకు తెలియకుండానే కాళ్లు ఊపుతున్నారా..అది స్టైల్ కాదు..ఈ లోపం సంకేతం

-

మన ఫ్రెండ్స్‌లోనో, మన ఇంట్లోనే కొంతమంది ఎక్కడ కుర్చున్నా..కాళ్లు ఊపుతూఉంటారు. గోడపైనా, ఛైర్‌లో, మంచంమీద ఇలా ఎక్కడ కుర్చున్నా సరే..ఊకే కాళ్లు ఊపుతూనే ఉంటారు. ఇంట్లో ఊపినప్పుడు పెద్దొళ్లు ఒప్పుకోరు. తిడతారు. ఆ క్షణం వరకు ఆపేస్తారు. మళ్లీ వాళ్లకే తెలియకుండా ఊపేస్తారు. ఇది నలుగురిలో ఉన్నప్పుడు ఏమంత బాగుండదు. బ్యాడ్‌ బిహేవియర్‌ అని ఎదుటివాళ్లు అనుకుంటారు. కానీ వాళ్లకే తెలయని ఒక సమస్య వల్ల వాళ్లు అలా ఊపుతున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం.

కాళ్లు ఊపడం అనేది.. నేరుగా ఎటువంటి హాని చేయదు కానీ, ధీర్ఘకాలికంగా ఈ అలవాటు ఆరోగ్య లోపాన్ని సూచిస్తుంట. కాళ్లు కదపడం అలవాటు చేసుకోవడం వల్ల నిపుణులు శరీరంలో ఐరన్ లోపించిందని చెబుతున్నారు. అలాంటి వారు ఒకసారి వైద్యుడ్ని సంప్రదించటం మేలు.కొన్ని నివేదికల ప్రకారం దాదాపు 10 శాతం మందికి కాళ్లు కదపడంలో సమస్యలు ఉన్నాయని తేలింది. 35 ఏళ్లు పైబడిన వారిలో ఇది సర్వసాధారణం. ఇది రెస్ట్‌లెస్ సిండ్రోమ్ నాడీ వ్యవస్థతో సంబంధం కలిగి ఉంటుంది. మీరు చూసినట్లైతే..ఆఫీసుల్లో పనిచేస్తే..కాస్త పెద్ద వయసు వాళ్లు కూడా ఇలా కాళ్లు ఊపుతు ఉంటారు. అయితే కాళ్ల వణుకు కూడా ఒక కారణం కావొచ్చు.

అందుకే ఈ అలవాటు మీకుంటే ఓసారి వైద్యుడి సలహా తీసుకోవటం ఉత్తమం. వాస్తవానికి పాదాలను కదిలేటప్పుడు వ్యక్తిలో డోపమైన్ హార్మోన్ విడుదల అవుతుంది. దాని కారణంగా అతను మళ్లీ మళ్లీ కదపాలని భావిస్తాడు. నిద్ర లేకపోవడం వల్ల కూడా ఇలా జరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఈ సమస్య గురించి తెలుసుకోవడానికి రక్త పరీక్ష చేస్తారు. సాధారణంగా శరీరంలో ఐరన్ లోపించడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. ఇది కాకుండా గర్భిణీలు, కిడ్నీ, పార్కిన్సన్స్ వ్యాధి ఉన్న రోగులలో, డెలివరీ చివరి రోజులలో ఇటువంటి సమస్యలు సంభవిస్తాయి. రక్తపోటు, షుగర్ పేషెంట్లు, హృద్రోగులలో దీని ప్రమాదం మరీ ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధి చికిత్సకు సాధారణంగా ఐరన్ మాత్రలు సూచిస్తారు. కాబట్టి భయపడకుండా..ఈ అలవాటు ఉన్నవాళ్లు డాక్టర్‌ను సంప్రదించి తగిన చికిత్స అంటే..వందశాతం..ఐరన్‌ మాత్రలే ఇస్తారు..అయితే మీరు ఏ స్టేజ్‌లో ఉన్నారో దాన్నిబట్టి చికిత్స ఇస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news