బ్రష్ చేసేప్పుడు నోట్లో వేళ్లుపెట్టుకోని కక్కుతున్నారా..? అసలు విషయం తెలిస్తే అలా చేయరు..

-

చాలామందికి బ్రష్‌ చేసేకునేప్పుడు రెండు వేళ్లు నోట్లు లోపలికి పెట్టుకోని వాంతు చేసుకోవడం అలవాటుగా ఉంటుంది. ఇలా చేస్తే కానీ వారికి బ్రష్ చేసిన అనుభూతి ఉండదు. అప్పుడే పొట్టలో ఉండే రసాలు, కఫం అన్నీ బయటకు వచ్చేస్తాయి. కానీ ఈ విధంగా బ్ర‌ష్ చేసేట‌ప్పుడు నోట్లో వేళ్లు పెట్టుకుని ప్ర‌తిరోజూ కక్క‌డం మంచిది కాద‌ని నిపుణులు చెబుతున్నారు.

ఇలా చేయ‌డం వ‌ల్ల గొంతు, పొట్ట‌, ప్రేగులు అధిక ఒత్తిడికి గుర‌వుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ ఒత్తిడి కార‌ణంగా గొంతులో ఉండే న‌రాలు చిట్లే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంద‌ని, అంతే కాకుండా ప్రేగుల‌పై క‌లిగే ఈ అధిక ఒత్తిడి కార‌ణంగా ప్రేగులపై ఉండే పొర ప‌గిలి ప్రేగులు బ‌య‌టికి రావ‌డం (హెర్నియా) వంటివి జ‌రుగుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

 

నోట్లో వేళ్లు పెట్టుకుని క‌క్క‌డం వంటివి ప్ర‌తి రోజూ చేయ‌కూడ‌ద‌ని వికారం, అజీర్తి కార‌ణంగా త‌ల‌నొప్పి వ‌చ్చిన‌ప్పుడు మాత్ర‌మే పొట్ట‌లోని ఆహార ప‌దార్థాలను బ‌య‌ట‌కు పంపించేందుకు ఇలా చేయాల‌ని నిపుణులు అంటున్నారు. గొంతులో పేరుకుపోయిన క‌ఫాన్ని , శ్లేష్మాన్ని తొల‌గించుకునేందుకు వేపపుల్ల‌తో బ్ర‌ష్ చేసుకోవచ్చు. ఇలా చేయ‌డం వ‌ల్ల వేప‌లో ఉండే చేదు కారణంగా జిగురు ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతుంద‌ని.. ఇలా ఉత్ప‌త్తి అయిన జిగురు క‌ఫాన్ని తొల‌గిస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

బ్ర‌ష్ చేసుకునేట‌ప్పుడు నోట్లో వేళ్లు పెట్టుకుని క‌క్క‌డం వల్ల శ‌రీరానికి హాని క‌లుగుతుంద‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు. క‌నుక ఎట్టి ప‌రిస్థితిలోనూ ఇలా చేయ‌వ‌ద్ద‌ని వారు అంటున్నారు. చాలామంది.. బ్రష్‌ చేసేప్పుడు బలవంతంగా ఇలా వేళ్లు పెట్టి వాంతులు చేసుకుంటారు. దీని వల్ల కళ్లు ఎర్రగా అవుతాయి. పొట్ట నొప్పి వస్తుంది. వారానికి రెండు మాడు సార్లు చేస్తే చాలు.. మీకు అంతలా బ్రష్‌ చేసిన ఫీల్‌ రాకుంటే.. వారంలో రెండుసార్లు వేప పుల్లతో బ్రష్‌ చేయండి.. దీని అంత మంచి పద్ధతి ఇంకోటి ఉండదు. తేనె లేదా గోరువెచ్చని నీళ్లతో పుక్కిలించడం వల్లకూడా నోట్లోని క్రిములు అన్నీ పోతాయి. ఆయిల్‌ పుల్లింగ్‌ చేయడం వల్ల నోట్లో ఎలాంటి దుర్వాసన ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news