బాబోయ్ ఇదేం విడ్డూరం..ఈ మేఘాల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

-

సాంఘిక శాస్త్రం ప్రకారం మేఘాలు ఎలా వస్తాయి అన్నది అందరికి తెలిసిందే..సూర్యుని వేడి ద్వారా నీరు ఆవిరై తర్వాత చల్లబడి మేఘాలు రూపంలో మారి వర్షాలు కురిపిస్తాయనే విషయాన్ని మనం చిన్నప్పుడే చదువు కున్నాము.ఈ ప్రక్రియ అంతా ఓ సైకిల్ లా జరుగుతుందని కూడా మనకు తెలిసు. కానీ ఓ చోట మాత్రం ఓ పెద్ద కొండ మేఘాలకు పుట్టినిల్లుగా మారింది. ఏదో పాత్ర నుంచి నీటి ఆవిరి వస్తున్నట్టుగా ఆ పెద్ద కొండ నుంచి మేఘాలు పుడుతూనే ఉన్నాయి. ఏంటి.. నిజమా అని ఆశ్చర్య పోకండి..ఇది నిజమే..వివరాల్లోకి వెళితే..

యూకేలో ఉంది ఈ అద్భుత వింత. జీబ్రాల్టర్‌ ద్వీపకల్పంలో సముద్ర తీరానికి కాస్త దూరంలో ఈ కొండ ఉంది. జీబ్రాల్టర్ ద్వీపకల్పంలో ఉంది కాబట్టి దీనికీ జీబ్రాల్టర్ మౌంటేనే అనే పేరు వచ్చింది. మొత్తం ఒకే రాయితో ఏర్పడిన ఈ కొండ ఒక వైపున ఏకంగా 426 మీటర్ల ఎత్తున శిఖరం ఉంటుంది. అది నిటారుగా ఉండి గాలికి అడ్డుగా నిలిచింది. ఈ క్రమంలో సముద్రం వైపు నుంచి వచ్చే గాలి ఈ కొండను తాకుతుండగా మేఘాలు ఏర్పడుతున్నాయి..

సాదారణంగా గాలి వీచే దిశలో పెద్ద పెద్ద పర్వతాలుగానీ, ఎత్తయిన కొండలుగానీ ఉన్నప్పుడు.. వీస్తున్న గాలి వాటిని తాకి పైకి లేస్తుంది. అలా పైకి వెళ్లినచోట తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా.. ఆ గాలిలోని నీటి ఆవిరి చల్లబడి చిక్కబడుతుంది. మంచు స్పటికాలుగా మారడం మొదలై మేఘాలు ఏర్పడతాయి. ఇలా పర్వతాలు, కొండల కారణంగా ఏర్పడే మేఘాలను ‘బ్యానర్‌ క్లౌడ్‌’గా పిలుస్తారట. జీబ్రాల్టర్‌ కొండ వద్ద ఏర్పడే మేఘాలు కూడా ఇదే విధంగా ఏర్పడినవని ఆ దేశ వాతావరణ శాఖ తెలిపింది.ప్రతి ఏడాది జూన్‌ నుంచి అక్టోబర్‌ వరకు ఈ చిత్రాన్ని చూడవచ్చు…ఆ మేఘాలు ఎలా వస్తున్నాయో ఒకసారి మీరే చూడండి..

 

Read more RELATED
Recommended to you

Latest news