బాబు, ఆర్కే వీడియో లీక్స్.. ఏడుగురు ఏబీఎన్ ఉద్యోగులపై ఆర్కే వేటు

-

వాళ్ల మధ్య సంభాషణ జరుగుతున్నప్పుడు ఓ ఉద్యోగి అక్కడికి వచ్చి సార్… మీ సంభాషణ మొత్తం లైవ్‌లో వెళ్తోంది సార్ అంటూ చెప్పగానే… చిర్రెత్తుకొచ్చిన చంద్రబాబు.. వెంటనే తన కాలికి ఉన్న షూ తీసి రాధాకృష్ణ మొహాన వేశారట.

ఇటీవల ఏపీ సార్వత్రిక ఎన్నికలకు ముందు.. బాబు, ఆర్కే సంభాషణలకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి గుర్తుందా? స్టూడియోలో ఆర్కేతో చంద్రబాబు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు విరామం సమయంలో వాళ్లిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడున్నవాళ్లు సీక్రెట్‌గా వాళ్ల సంభాషణను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలను రికార్డు చేసిన ఏడుగురు ఏబీఎన్ సిబ్బందిపై వేటు వేశారట ఆర్కే. వాళ్లను ఉద్యోగం నుంచి తొలగించారట.

వాళ్ల మధ్య సంభాషణ జరుగుతున్నప్పుడు ఓ ఉద్యోగి అక్కడికి వచ్చి సార్… మీ సంభాషణ మొత్తం లైవ్‌లో వెళ్తోంది సార్ అంటూ చెప్పగానే… చిర్రెత్తుకొచ్చిన చంద్రబాబు.. వెంటనే తన కాలికి ఉన్న షూ తీసి రాధాకృష్ణ మొహాన వేశారట. అప్పుడు స్టూడియోలో పెద్ద గొడవే జరిగిందట. చంద్రబాబు గొడవ జరుగుతున్నప్పుడు మాట్లాడుతూ… నీకు దాదాపు 1500 కోట్ల యాడ్స్ ఇచ్చాను. ఇప్పుడు నువ్వు నన్ను బజారుకు ఈడుస్తున్నావు.. అంటూ ఆర్కే మీద ఫైర్ అయ్యారట. వేరే వాళ్ల దగ్గర ఎంత తీసుకొని ఈ పని చేశావు.. అని ఆర్కే మీద చంద్రబాబు గట్టిగా అరుస్తూ నిలదీశారట. ఏబీఎన్ ఉద్యోగులపైనా ఫైర్ అయ్యారట చంద్రబాబు. వాళ్లందరినీ తిట్టారట. ఈఘటన ఆఫీసు మొత్తం చర్చనీయాంశమైందట. ఎవరి నోట విన్నా స్టూడియోలో అలా జరిగింది.. ఇలా జరిగింది.. అంటూ ఒకటే చర్చ అట. వెంటనే చంద్రబాబు ఆదేశాలతో.. చానెల్‌లో పనిచేస్తోన్న ఏడుగురు ఉద్యోగులను ఆర్కే ఉద్యోగంలో నుంచి తీసేశారట.


ఎన్నికల ముందు వాళ్లు రహస్యంగా మాట్లాడుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అవి ఓట్లపై ఎంతో కొంత ప్రతికూల ప్రభావం చూపించి ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే.. ఒక వీడియోలోనేమో.. ఎన్టీఆర్‌ను వాడు.. వీడు అంటూ చంద్రబాబు, ఆర్కే తిట్టడం, మరో వీడియోలో పీఆర్‌సీపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగులపై చంద్రబాబు, ఆర్కే ఫైర్ అవ్వడం స్పష్టం కనిపిస్తోంది. అది వాళ్లకు నష్టమే చేకూర్చుతుందని గ్రహించి.. దానిపై ఆంధ్రజ్యోతిలో ఎదురుదాడి కూడా చేశారు. అవి ఇప్పటి వీడియోలు కావు.. పాత వీడియోలను పట్టుకొని కావాలని రాద్ధాంతం చేస్తున్నారంటూ ఆంధ్రజ్యోతి వెంటనే తెల్లారి కథనాలను వండి వార్చింది. కానీ.. ఏపీ ప్రజలు ఆ కథనాలను నమ్మలేదు. ఆ వీడియోలనే నమ్మారు. ఓట్లు గుద్దారు. మరి.. చంద్రబాబుకు వ్యతిరేకంగా గుద్దారా? లేదా? వీడియోల ప్రభావం ఉందా? లేదా? అంటే మే 23 దాకా ఆగాల్సిందే.

నోట్‌: ఇది వాట్స‌ప్ ఆధారంగా రాసిన వార్త‌. వాట్స‌ప్‌లో ఈ వార్త వైర‌ల్ అవుతోంది. దాని ఆధారంగా రాసిందే త‌ప్పితే.. వార్త జెన్యునిటీకి, మ‌న‌లోకం.కామ్ వెబ్‌సైట్‌కు ఎటువంటి సంబంధం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version