కాలికి తొమ్మిది వేళ్ల‌తో పుట్టిన బాబు.. ఎక్క‌డంటే?

సాధార‌ణంగా ప్ర‌తి ఒక్క‌రికీ కాలికి లేదా చేతికి ఐదు వేళ్లు మాత్ర‌మే ఉంటాయి. అయితే కొంద‌రికి మాత్రం ఆరు వేళ్లు కూడా ఉంటాయి. ఇంత‌కంటే ఎక్కువ ఉన్న వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. కానీ ఒకే కాలికి తొమ్మిది వేళ్లు ఉండ‌టం అనేది అత్యంత అరుదుగా జ‌రుగుతుంది. ఇప్పుడు క‌ర్నాట‌క‌లోని హోసాపేట్‌లో ఇదే జ‌రిగింది.

స్థానిక ఆస్ప‌త్రిలో ఓమ‌హిళ‌కు డాక్ట‌ర్ బాల‌చంద్ర‌న్ డెలివ‌రీ చేశారు. పుట్టిన అబ్బాయి ఎడ‌మ కాలికి ఏకంగా తొమ్మిది వేళ్లు ఉన్నాయి. దీంతో డాక్ట‌ర్లు, సిబ్బంది ఆశ్చ‌ర్య‌పోయారు. ఇలాంటి కేసులు చాలా అరుదుగా జ‌రుగుతాయ‌ని వారు చెబుతున్నారు.

అయితే బాబుకు ఎలాంటి ఆరోగ్య స‌మ‌స్య‌లు లేవ‌ని, త‌ల్లీ, బిడ్డ‌లు ఇద్ద‌రూ క్షేమంగా ఉన్నార‌ని డాక్ట‌ర్ వివ‌రించారు. ఇలాటి ఘ‌ట‌న‌లు మెడిక‌ల్ చ‌రిత్ర‌లో చాలా అరుద‌ని డాక్ట‌ర్ స్ప‌ష్టం చేశారు. అయితే తాము గ‌తంలో చూసిన కేసుల‌ను మ‌హిళ కుటుంబ స‌భ్యుల‌కు చూపించి అవ‌గాహ‌న క‌ల్పించామ‌న్నారు. ఇక మ‌హిళ కుటుంబ స‌భ్యులు ఇది దేవుడి వ‌రం అని సంబుర ప‌డ్డారు. త‌ల్లీ, బిడ్డ‌ల‌ను క్షేమంగా చూసినందుకు డాక్ట‌ర్ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.