ఈ మధ్య కాలంలో విమానం, హెలికాప్టర్ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. తరుచూ ఎక్కడో ఒకచోట ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా రష్యాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నట్టు సమాచారం. అయితే రష్యన్ ఫార్ ఈస్ట్ లోని కమ్ చట్కా ద్వీపకల్పంలో 22 మందితో ప్రయాణిస్తున్న రష్యన్ Mi8 హెలికాప్టర్ అదృశ్యమైనట్టు రష్యా ప్రభుత్వ మీడియా వెల్లడించింది.
టాస్ ప్రకారం.. ఇది ద్వీపకల్పంలో పర్యాటక యాత్రలను నిర్వహించే విత్యాజ్ ఏరో ఎయిర్ లైన్ కు చెందిందని పేర్కొంటున్నారు. వచ్కా జెట్స్ అగ్నిపర్వతం సందర్శించే సమయంలో హెలికాప్టర్ అదృశ్యమైనట్టు సమాచారం. రష్యాకు చెందిన ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ ఏజెన్సీ తప్పిపోయిన హెలికాప్టర్ లో మొత్తం 22 మంది ఉన్నట్టు నివేదించింది. ఈ తరుణంలో అప్రమత్తం అయిన అధికారులు విచారణ చేపడుతున్నట్టు రష్యా మీడియా వెల్లడించింది. అసలు హెలికాప్టర్ మిస్ కావడానికి కారణం ఎవరు రకరకాల ఊహగానాలు వినిపిస్తున్నాయి. మరికొద్ది గంటలు అయితే కానీ క్లారిటీ రాదు.