రూ.100లోపే మంచి స్టాక్స్‌! త్వరగా కొనేయండి?

-

మీరు స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకు అందుబాటులోనే చౌక ధరలో మంచి స్టాక్స్‌ బ్రోకింగ్‌ కంపెనీలు కొన్ని స్టాక్స్‌ను సిఫార్సు చేశాయి. వీటిలో డబ్బులు పెడితే మంచి రాబడి పొందవచ్చని అంటున్నారు.

మీరు ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. స్టాక్‌ మార్కెట్‌లో లాభాలు ఆర్జించవచ్చు. అదేసమయంలో భారీగా నష్టపోవాల్సి కూడా రావచ్చు అందుకే స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేయదలచినవారు అన్నింటికీ సిద్ధపడాల్సి ఉంటుంది. నిపుణులు, స్టాక్‌ బ్రోకింగ్‌ కంపెనీలు స్టాక్‌ కొన్ని రికమెండ్‌ చేస్తాయి. ఇచ్చిన వాటిలో డబ్బులు పెట్టవచ్చు. అయితే వీటిలో నష్టాలు రావని కాదు. కొన్ని విషయాలను మీరే స్వయంగా తెలుసుకొని, అనాలసిస్‌ చేసి మరి స్టాక్‌ మార్కెట్‌లో డబ్బులు పెట్టాలి.

స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థలు సిఫార్సు చేస్తున్న బెస్ట్‌ స్టాక్స్‌

ఎన్‌సీసీ, వెల్‌స్పన్‌ ఇండియా, జమ్నా ఆటో ఇండస్ట్రీస్, అర్వింద్‌.
ఇవ్వన్నీ అతి తక్కువ ధరకే కొనగలిగే షేర్లు. కేవలం రూ.100 లోపే అందుబాటులో ఉన్నాయి. అర్వింద్‌ కంపెనీ షేర్‌ రూ.95 గా అంచనా వేశారు. షేర్‌ ఖాన్‌ ఈ షేరుకు టార్గెట్‌ ప్రైస్‌ను నిర్ణయించింది. ప్రస్తుతం ఈ షేరు ధర రూ.75 వద్ద ఉంది. అలాగే ఎన్‌సీసీ షేరు కూడా కొనవచ్చని బ్రోకరేజీ సంస పేర్కొంటుంది. అలాగే దీని షేర్‌ ధర కూడా రూ. 120 చేరవచ్చని జియోజిత్‌ సంస్థ అంచనా వేస్తోంది. ఈ షేర్‌ ప్రస్తుత ధర రూ.88 వద్ద ఉంది. జమ్నా ఇండస్ట్రీస్‌ షేర్‌ కూడా తక్కువ ధరకే అందుబాటులో ఉండటం వల్ల ఈ
షేర్‌ను నిరభ్యంతరంగా కొనవచ్చని దోలత్‌ క్యాపిటల్‌ పేర్కొంటుంది. ఈ షేర్‌ రూ.99కి చేరవచ్చని అంచనాలున్నాయి. ప్రస్తుతం దీని ధర రూ.70 వద్ద ఉంది. ఇక వెల్‌స్పన్‌ ఇండియా షేర్‌ను కొనవచ్చని బ్రోకరేజీ సంస్థ షేర్‌ ఖాన్‌ సిఫార్సు చేసింది. ఈ షేర్‌ ప్రస్తుత ధర రూ.82. అయితే దీని ధర కూడా రూ. 90 కి చేరవచ్చని అంచనాలున్నాయి. ఈ షేర్ల ధరలు వంద లోపే ఉన్నాయి కనుక స్టాక్‌ మార్కెటింగ్‌లో ఇప్పుడే అడుగుపెట్టబోయే ఇన్వెస్టర్స్‌ వీటిని కొనవచ్చు. ఎందుకంటే నష్టపోయినా తక్కవ నష్టం కలుగుతుంది. పెద్ద ఇన్వెస్ట్‌మెంట్‌ పెట్టబోయేటప్పుడు ఇదొక అనుభవ పాఠం అవుతుంది. లాభాలొస్తే ఇక అడుగు ముందుకేయడమే.

Read more RELATED
Recommended to you

Latest news