బ్రిటన్ అంటే చాలా అభివృద్ధి చెందిన దేశం. మొదటి, రెండో ప్రపంచ యుద్ధంలో దాని పాత్ర చాలా ప్రాముఖ్యం. అయితే ఇప్పుడు ఆ దేశాన్ని బాంబులు భయపెడుతున్నాయి. ఏ దేశమైనా దాడి చేస్తుందనుకుంటే పొరపాటే. ఈ బాంబులు ఇప్పటివి కావు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలోనివి. ఇప్పుడు వరుసగా బయట పడటంతో జనాలు నిలువునా వణికి పోతున్నారు.
రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీకి చెందిన హిట్లర్ దళాలు బ్రిటన్‌లోని చాలా ప్రాంతాల్లో బాంబు దాడులు చేశాయి. అందులో ఎక్సెటర్ కూడా ఒకటి. ఈ ప్రాంతంలో హిట్లర్ ఆదేశాల మేరకు 2,200 ఎల్‌బీ అంటే వెయ్యికేజీల బాంబులతో దాడులు చేశారంట.
అయితే ఆ దాడి సమయంలో చాలా బాంబులు పేలలేదు. దీంతో అవన్నీ భూమిలో కప్పుకుని పోయాయి. ఇలా కనీసం 10శాతం బాంబులైనా భూమిలో పేలకుండా అలాగే ఉండిపోయాయి. అయితే తాజాగా ఓ ఇంటి నిర్మాణం కోసం సదరు యజమాని జేసీబీతో తవ్వకాలు జరపగా.. ఈ బాంబులు కనపడ్డాయి. దీంతో వారు పోలీసులకు సమచారం ఇవ్వడంతో.. వారు వచ్చి అక్కడి ప్రాంత ప్రజలను ఖాళీ చేయించారు. భద్రతా చర్యలతో ఆ బాంబులను పేల్చేశారు. దీంతో బ్రిటన్ ఉలిక్కిపడింది. మిగతా బాంబుల సంగతి ఏంటా అని అంతా భయపడిపోతున్నారు.