ఇతనేం బౌలర్ రా బాబూ… కుడి, ఎడమ చేతులతో వికెట్ తీసిన బౌలర్… వీడియో వైరల్…!

-

దక్షిణాఫ్రికా దేశానికి చెందిన ఒక బౌలర్ కుడి, ఎడమ చేతులతో బంతులు విసిరి వికెట్లు పడగొట్టాడు. ఈ సంఘటన సౌత్ ఆఫ్రికా దేశవాళీ మ్యాచ్ లో చోటు చేసుకుంది. సాధారణంగా బౌలర్లు అందరూ కూడా ఏదో ఒక చేత్తోనే బౌలింగ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆ చేత్తోనే తమ వ్యూహాలను అమలు చేస్తూ బ్యాట్సమెన్ ని తికమక పెడుతూ ఉంటారు. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తూ ఉంటారు. అలా అయితే నాణ్యమైన బౌలర్లు అవుతూ ఉంటారు. కానీ ఒక ఆటగాడు మాత్రం రెండు చేతులతో బంతులు విసిరి వికెట్లు తీసాడు.

సౌత్ ఆఫ్రికా దేశవాళీ మ్యాచ్ లో జరిగిన ఈ సంఘటన ఆశ్చర్యంగా మారింది. వివరాల్లోకి వెళితే సౌతాఫ్రికాలో జరుగుతున్న ఎమ్‌జాన్సీ టీ20 సూపర్‌ లీగ్‌ లో గ్రెగొరీ మహలోక్వానా కేప్‌టౌన్‌ బ్లిట్జ్‌ తరఫున ఆడుతున్నాడు. ఆదివారం డర్బన్‌ హీట్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను ఇద్దరు కీలక ఆటగాళ్లను పెవిలియన్ చేర్చాడు. ఇక్కడే ఒక వింత నమోదు అయింది… తొలుత కుడి చేతి బౌలింగ్‌ చేసి ఓపెనర్‌ సారే ఎర్వీ వికెట్ తీసుకున్న అతను… ఎడమ చేతితో బౌలింగ్‌ చేసి డానే విలాస్‌ ను కేలీన్ బౌల్డ్ చేయడంతో ఒక్కసారిగా మైదానంలో ఆశ్చర్యపోయారు.

ముఖ్యంగా అతను ఎడమ చేత్తో విసిరిన బంతికి మైదానంలో ఫిదా అయిపోయారు. స్పిన్ బౌలర్ అయిన అతను… ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో అతని జట్టు పది పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేప్ టౌన్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. తర్వాత మోస్తారు లక్ష్యంతో బరిలోకి దిగిన డర్బన్ హీట్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 164 పరుగులు మాత్రమే చేసింది. ప్రస్తుతం అతని బౌలింగ్ కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news