400 మందికి పైగా పన్నెండవ తరగతి విద్యార్థులు హెడ్ లైట్ల వెలుగులో పరీక్షని వ్రాసారు..!

-

బీహార్ లో ఒక కళాశాలలో పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కష్టపడాల్సి వచ్చింది. 12వ తరగతి పరీక్షలు బీహార్ లో నిర్వహిస్తుండగా మొదటి రోజు ఈస్ట్ చంపారన్ మోతీహారి టౌన్ లో ఉన్న మహారాష్ట్ర హరేంద్ర కిషోర్ సింగ్ కాలేజ్ కి 400 మంది హిందీ పరీక్ష రాయటానికి వచ్చారు. అయితే సెకండ్ సెట్టింగ్ షెడ్యూల్ ని 1:45 నుండి 5 గంటల వరకు నిర్వహించాల్సి ఉంది.

ముందుగా సీటింగ్ అరేంజ్మెంట్ సరిగ్గా చేసుకోక పోవడంతో నాలుగు గంటల వరకు పరీక్ష రాయడం కుదరలేదు. దీంతో తల్లిదండ్రులు యాజమాన్యం పై కోప్పడ్డారు. కాలేజీకి విరుద్ధంగా స్లొగన్స్ ని చెప్పారు. సౌరబ్ సుమన్ యాదవ్ మరియు డిఎస్పి అరుణ్ కుమార్ యాదవ్ పరీక్ష కేంద్రానికి వచ్చి పరిస్థితిని కంట్రోల్ చేశారు.

ఆఖరికి పరీక్ష నాలుగు గంటలకు మొదలైంది. ఏడు వరకు విద్యార్థులు పరీక్షలు రాశారు. అయితే కాలేజీకి పవర్ సప్లై లేక పోవడం తో జనరేటర్ తీసుకు వచ్చినా పని చేయలేదు. ఇక తల్లిదండ్రులు వచ్చిన కార్ల హెడ్ లైట్లు వేసి ఉంచితే అప్పుడు పరీక్షని విద్యార్థులు రాశారు.

Read more RELATED
Recommended to you

Latest news