ఈ దేశాల్లో కోకాకోలా అమ్మరట.. రహస్యంగా తెచ్చుకుంటే కఠిన శిక్షలే..!

-

కోకాకోలా అంటే.. చాలామందికి ఇష్టం ఉంటుంది.. బిర్యానితో సూపర్ కాంబినేషన్ కదా.. స్పైసీ ఫుడ్ తిన్నాక కోక్ తాగితే భలే మజా వస్తుంది. అయితే ఇది ఎక్కువ తాగటం ఆరోగ్యానికి మంచిది కాదంటారు వైద్యులు. మంచిచెడులు పక్కన పెడితే కొన్ని దేశాల్లో ఈ కోక్ అసలు అమ్మరట. ప్రపంచవ్యాప్తంగా కోకా-కోలా లభిస్తోంది. అయితే పంచంలోని రెండు దేశాల్లో మాత్రం లీగల్‌గా ఈ డ్రింక్ లభించట్లేదు. అక్కడ ఈ డ్రింక్ ఎంత రేటు పెట్టి కొందామన్నా దొరకదట. ఏ విదేశాల నుంచో తెప్పించుకొని రహస్యంగా తాగితే కుదరదు. చర్యలుంటాయట. ఆ రెండు దేశాలూ ఏవో కాదు..దక్షిణ అమెరికాలోని క్యూబా, ఉత్తరకొరియా. ఈ రెండుదేశాల్లో రకరకాల కూల్ డ్రింక్స్ లభిస్తాయి గానీ కోకాకోలా మాత్రం ఉండదు. ఎందుకు అమ్మరు అని అడిగితే… షాపుల వాళ్లు… ” సప్లై ఉండదు… కాబట్టి మేము కూడా అమ్మం” అని చెబుతారు. మరి ఎందుకు సప్లై ఉండదో తెలుసుకుందాం.

cocacola

మీకు తెలుసో లేదో.. క్యూబాలో అంతగా రాజకీయ స్వేచ్ఛ ఉండదు. ఇక ఉత్తరకొరియా ఆల్రెడీ నియంత కిమ్ జోంగ్ ఉన్ అధీనంలో ఉంది. కిమ్‌కి ఏదైనా డీల్ నచ్చకపోతే అంతే ఆ ఉత్పత్తిని తన దేశంలోకి రానివ్వడు. అటు క్యూబా, ఇటు ఉత్తర కొరియాలో వ్యాపార ఒప్పందాలు అంత త్వరగా కుదరవు కూడా. అవి ఓ పట్టాన తేలవు. ఆ రెండు దేశాలూ రకరకాల కొర్రీలు పెడతాయి. ఎన్నో ఆంక్షలు విధిస్తాయి… అవన్నీ భరిస్తూ… వ్యాపారం చెయ్యడం తమ వల్ల కాదంటోంది కోకా-కోలా. ఈ రెండు దేశాల్లో విదేశాల నుంచి రహస్యంగా తెచ్చుకొని కూడా కోక్ తాగకూడదు. అలా తాగితే… కఠిన శిక్షలు ఉంటాయట. వామ్మే ఇదెక్కడి గోలరా బాబు అనిపిస్తుంది కదూ..

ఒకప్పుడు మయన్మార్ లో కూడా

 

మయన్మార్ కూడా ప్రస్తుతం సైనిక పాలనలో ఉంది. అక్కడ కూడా కఠిన ఆంక్షలున్నాయి… అయితే 2012 వరకూ మయన్మార్‌లో కోక్ దొరికేది కాదట… ఆ తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చి కోకాకోలాపై ఉన్న నిషేధాన్ని ఎత్తేసింది. దాంతో ఆ కంపెనీ రూ.1500 కోట్లతో తయారీ కంపెనీని పెట్టి ఉత్పత్తిని ప్రారంభించింది. అందువల్ల ఇప్పుడు సైనిక పాలన ఉన్నా మయన్మార్ ప్రజలకు కోక్ లభిస్తోంది. ఇక వియత్నాంలో అయితే 1994, చైనాలో 1979 వరకూ కోకాకోలా అమ్మేవారు కాదు. ఇప్పుడు అయితే… అక్కడ ఈ డ్రింక్ బాగానే లభిస్తోంది.

ఇలా మనకు ఈజీగా దొరికే ఈ కోక్ ఆ దేశాల్లో దొరకటం అంత తేలికగా జరగలేదనమాట..ప్రపంచవ్యాప్తంగా కోక్ అందుబాటులో ఉన్నా..ఈ రెండు దేశాల్లో కోకాకోలా..తమ మార్కెట్ ను ప్రారంభించేందుకు మాత్రం ఏం చర్యలు అయితే చేయటం లేదు..ఇప్పడప్పుడే ఈ దేశాల్లో కోక్ లభించేలా లేదనే చెప్పాలి.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news