ఆరేళ్లుగా వృథాగా పడేసిన రాయి..కానీ ఇప్పడు అది బంగారం కంటే విలువైందట ..!

-

అరుదైన వస్తువులకు, కాయిన్స్ కు డిమాండ్ అమాంతం పెరిగిపోతుంది. అప్పుడప్పుడు మనం వార్తల్లో చూస్తూనే ఉంటాం..ఈ సంవత్సరంలో ఉన్న కాయిన్ మీ దగ్గరుంటే లక్షాధికారి అయినట్లే అని..ఇలానే 2015లో డేవిడ్ హోల్ అనే వ్యక్తికి ఆస్ట్రేలియాలోని గనుల దగ్గర పనిచేస్తుంటే..ఓ రాయి కనిపించింది. అది ఏం చిన్న రాయి కాదు..17 కేజీల బరువు ఉంది. తను కూడా ఆ రాయి బాగా విలువైందేమో అనుకుని..పనిమీద శ్రద్ద మానేసి..రాయినే అదేపనిగా చూడసాగాడు..మొత్తానికి షిప్ట్ అయిపోయాక తనతోపాటు ఇంటికి తెచ్చుకున్నాడు..ఆ తర్వాత ఏం ఏం జరిగాయో మీరే చూడండి.

అతను ఆ రాయి గురించి ఎవరికీ చెప్పలేదు. రోజూ ఆ రాయిని చూసి తెగ మురిసిపోయేవాడట…అందులో ఉన్న బంగారం ఉంటుందని ఫిక్స్ అయిపోయాడు..ఆ బంగరాన్ని ఏం అని కలలు కనడం… ఇదంతా అతని ఊహాలోకం అయ్యింది. ఓ రోజు రాయిని గీసి చూశాడు. ఏ బంగారమూ రాలేదు…. ఓసారి పగలగొట్టేందుకు ప్రయత్నించాడు కానీ మనసు ఒప్పలేదు… మరోసారి మళ్లీ ప్రయత్నించాడు. కానీ అది పగలలేదు. ఎంత ప్రయత్నించినా వృథా అయ్యింది.

అది ఎందుకు పగలట్లేదో ఏమో అనుకున్నాడు. ఇలా రోజులు కాస్తా… నెలలు… సంవత్సరాలూ కరిగిపోయి. కట్ చేస్తే.. ఆరేళ్లు గడిచాయి.. ఇంట్లోవాళ్లు ఇంకా అలా ఎన్నాళ్లు ఆ రాయిని దాయాలని డిస్కషన్ పెట్టారు. అతనికి కూడా విషయం తేలిపోవాలి అనిపించింది. అందులో బంగారం ఉందో లేదో తెలియాల్సిందే అనుకున్నాడు. అందుకోసం… తాజాగా మెల్బోర్న్‌లోని మ్యూజియంకి దాన్ని తీసుకెళ్లాడు. దాని సంగతేంటో చెప్పమన్నాడు.

మ్యూజియంలో భూగర్భ నిపుణుడైన డెర్మోట్ హెన్రీ ఆ రాయిని పరిశీలించి ఆశ్చర్యపోయాడు. దాన్ని తెచ్చిన డేవిడ్ వైపు చూస్తూ… మీరు ఇందులో బంగారం ఉందా అని అడిగారు కదూ బంగారం కాదు ఇది అంత కంటే విలువైనది అన్నాడు.. ఇది పురాతనమైన ఉల్క..ఇది 460 కోట్ల సంవత్సరాల కిందటిది… అని చెప్పగానే… డేవిడ్‌కి మైండ్ బ్లాక్ అయింది. ఎలా స్పందించాలో అర్థం కాలేదు. ఉల్క అంటే ఏంటో అన్నట్లు చూశాడు… బంగారం కంటే విలువైనదా అని బేలగా చూశాడు.

దీనిపై డెర్మోట్ హెన్రీ మాట్లాడుతూ..తన 37 ఏళ్ల సర్వీసులో ఇలాంటి ఉల్క రాళ్లను రెండు మాత్రమే చూశానని చెప్పారు. ఇవి భూ వాతావరణం లోకి రాగానే… రాపిడి వల్ల ఉడుకి కాలిపోతూ ఉంటాయి… తీరా భూమిపై పడిన తర్వాత… ఇక్కడి చల్లదనం వల్ల మెల్లగా కూల్ అవుతాయి. ఆ క్రమంలో వీటికి ఓ రూపం అనేది వస్తుందిని డెర్మోట్ చెప్పుకొచ్చారు.

ఈ రాయి బంగారం కంటే ఎక్కువ విలువైనది అనడానికి బలమైన కారణం ఉంది… దీన్ని శాస్త్రవేత్తలు అంతరిక్ష పరిశోధనల కోసం ఉపయోగిస్తారు. భూమి పుట్టి 450 కోట్ల సంవత్సరాలైంది. అంతకంటే పాతదైన ఈ రాయి.. ఎలా తయారైంది… అప్పట్లో విశ్వంలో వాతావరణం ఎలా ఉండేది అనేది ఈ రాయి ద్వారా తెలిసే ఛాన్స్ ఉంది. ఇలాంటి రాళ్లు నక్షత్రాల నుంచి వచ్చే దుమ్ము, దూళితో తయారవుతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు..

ప్రస్తుత రాయి… అంగారక గ్రహం, గురుగ్రహం మధ్య ఉండే గ్రహశకలాలకు చెందినది అని తేల్చారు. ఇతర గ్రహశకలాలు ఢీకొట్టుకున్నప్పుడు… మధ్యలో చిక్కుకున్న ఈ రాయి దారి మళ్లి భూమివైపు వచ్చేసిందని.. భూమిని ఢీకొట్టిందని అంచనా వేశారు. ఇది భూమిపైకి వచ్చి 100 ఏళ్ల నుంచి 1000 ఏళ్లు అయి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

మొత్తానకి అది రాయి చరిత్ర..అయితే మరీ ఈ రాయిని తెచ్చిన మన డేవిడ్ హోల్ కు ఎంత మాత్రం ఇస్తారన్నది తెలియాల్సి ఉంది. అసలే అన్ని సంవత్సరాలు దానికిచూసుకుంటూ పగటి కలలు కన్నాడు కదా..!

Read more RELATED
Recommended to you

Latest news