సంక్రాంతి వచ్చింది తుమ్మెద.. సరదాలు తెచ్చింది తుమ్మెద అంటూ సంక్రాంతి పండక్కి నగర వాసులంతా పల్లెలకు పయనమవుతున్నారు. ఇంకా పండుగకు మూడు రోజుల సమయం ఉంది. అయినప్పటికీ.. ఏపీలోని గోదావరి జిల్లాల్లో అప్పుడే సందడి ప్రారంభమయింది. కోళ్లపందేలు ప్రారంభమయ్యాయి. గోదావరి జిల్లాల్లో సంక్రాంతికి నిర్వహించే కోడి పందేలను చూడటానికే దేశంలోని పలు ప్రాంతాల నుంచి జనాలు తరలివస్తారు.
తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం, రంగంపేట ప్రాంతాల్లో కోడి పందేలు ప్రారంభమయ్యాయి. అయితే.. అక్కడ భారీ స్థాయిలో కోడి పందేలు జరుగుతున్నాయని తెలుసుకున్న పోలీసులు కోడి పందేలను అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకుంటున్నా… కోడి పందేలు నిర్వహించకూడదని కోర్టు చెప్పినా.. కోడి పందేలు మాత్రం యేథేచ్ఛగా జరుగుతూనే ఉన్నాయి. రోజు రోజుకూ పందేల జోరు పెరుగుతోంది.