క్రేజీ ప్రాంక్.. చూస్తే న‌వ్వులే న‌వ్వులు

-

ప్రజెంట్ డిజిటల్ వరల్డ్‌లో ప్రతీ ఒక్కరు సోషల్ మీడియా ప్రజెన్స్‌పైనే దృష్టి సారిస్తున్నారు.
సోషల్ మీడియాలో జరుగుతున్న విషయాలను గురించి తెలుసుకుంటూనే క్రేజీ ప్లస్ యూనిక్ థింగ్స్ పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. కాగా, డిఫరెంట్ చాలెంజెస్ సోషల్ మీడియాలో ట్రెండవుతుంటాయన్న సంగతి అందరికీ విదితమే. కాగా, కొద్దికాలం నుంచి ప్రాంక్ వీడియోస్ ట్రెండ్ నెట్టింట నడుస్తుంది. ఇకపోతే ఈ వీడియో‌లు చూస్తే ఎవరైనా ఆశ్చర్యం వ్యక్తం చేయాలంతే.. ఈ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే, ప్రాంక్ హద్దు మీరితే వైపరీత్యాలు సంభవించొంచ్చు. ఈ క్రమంలో భౌతికంగా దాడులు జరిగిన ఘటనలు బోలెడున్నాయి. కాగా పక్కా స్క్రిప్ట్ ప్రకారం చేస్తే కొన్ని వీడియోస్‌ను లిమిట్స్‌లోనే చేస్తున్నారు ప్రాంక్‌స్టర్స్. తాజాగా ఓ ప్రాంక్ వీడియో ఇప్పుడు ఫుల్ వైరలవుతోంది. ఇంతకీ ఇందులో ఏముందంటే..

ప్రాంక్ షూట్ చేసే క్రమంలో ఓ బాల్ హెడ్ వ్యక్తి విగ్ బిట్ పెట్టుకుని మాల్‌లోకి ఎక్సలేటర్ పైకి వెళ్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే ప్రజలు తనవైపు చూస్తున్నప్పుడు విగ్ బిట్ ఊడిపోయేలా బట్ట తల ఉణ్న వ్యక్తి తన తలను ఎగరెయ్యాలి. అప్పుడు ఎదుటివారి ఫన్నీ లేదా ఆశ్చర్యకరమైన రియాక్షన్స్‌ను వీడియోలో రికార్డ్ చేయాలి. ఇలా తాము అనుకున్నట్లుగా కొందరి రియాక్షన్స్ గ్రాబ్ చేశారు. అయితే ఓ వ్యక్తి మాత్రం ప్రాంక్ చేస్తున్న వ్యక్తికి దిమ్మదిరిగే రిప్లై ఇచ్చాడు. ప్రాంక్ చేయబోయే వ్యక్తి మాదిరిగానే అతగాడు యాక్ట్ చేశాడు. నాది కూడా విగ్.. అన్నట్లుగా ఎక్స్‌లేటర్‌పై ఎదురుగా వస్తున్న వ్యక్తి కూడా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చి..

తల ఎగరేసి విగ్ ఊడిపోయేలా చేశాడు. దీంతో ప్రాంక్ చేసిన వ్యక్తి ఆశ్చర్యం వ్యక్తం చేసి తెగ నవ్వుకున్నాడు. ఈ సీన్ చూసిన వ్యక్తులు కూడా తెగనవ్వేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో బాగా వైరల్ అవుతున్నది. వీడియో చూసిన నెటిజన్లు లాఫింగ్ సింబల్స్ పోస్ట్ చేసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీడియో చూసిన ప్రతీ ఒక్కరు ఇద్దరూ సూపర్ గ్రేట్ పర్సన్స్ అని కామెంట్స్ చేస్తుండటం విశేషం. ప్రాంక్ చేయబోతున్న వ్యక్తికి రిటర్న్ పంచ్ ఇచ్చిన వ్యక్తి ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్ అని పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news