ఫ్యాన్సీ నంబర్లతో కోట్ల ఆదాయం…!

-

అవును దేశంలో రవాణా శాఖ ఇప్పుడు ఫ్యాన్సీ నంబర్ల పుణ్యమా అని కోట్ల ఆదాయం అర్జిస్తుంది. ఫ్యాన్సీ నెంబర్ అనేది ఈ మధ్య కాలంలో ఒకరకంగా ఫ్యాషన్ గా మారిపోయింది. కోటి రూపాయలు ఖరీదు చేసే కారు కొన్న వ్యక్తి కనీసం పది లక్షలు పోసి ఫ్యాన్సీ నెంబర్ కొనుగోలు చేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో దీనికి మంచి డిమాండ్ ఉంది. సీరీస్ వచ్చిన ప్రతీ సారి కొత్త నంబర్ల కోసం పోటీ పడుతున్నారు.

ఇటీవల తెలంగాణా ప్రభుత్వం ఒక కొత్త ఫ్యాన్సీ 9999తో విడుదల చేయగా దాన్ని దక్కించుకోవడానికి ఒక వ్యక్తి 10 లక్షల వరకు ఖర్చు చేసారు. అలాగే లక్కీ నెంబర్ ఫ్యాన్సీ అయితే చాలు విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. కొత్త వాహనాలను కొనుగోలు చేసే వారు అందరూ కూడా ఇప్పుడు ఫ్యాన్సీ నెంబర్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇక సంఖ్యా శాస్త్రం పిచ్చి ఉన్న వాళ్ళు అయితే దీని మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

హైదరాబాద్, విజయవాడ, విశాఖ, గుంటూరు, ఈ నాలుగు నగరాల్లో మన తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్సీ నెంబర్ పిచ్చి ఉంది. తమ నెంబర్ ప్రత్యేకంగా కనపడాలి అనే ఉద్దేశంలో భాగంగా ఈ ఫ్యాన్సీ నెంబర్ కోసం పోటీ పడుతున్నారు. రవాణా శాఖ కార్యాలయాలు కూడా దీనికి వేలం పాట నిర్వహించడంతో ఆసక్తి ఉన్న వారు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. దీనితో కోట్ల ఆదాయం వస్తుంది.

సిని పెద్దలు, ప్రముఖ వ్యాపారులు, ఐటి ఉద్యోగులు ఇలా అందరూ దీని మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. తమ అభిమాన రాజకీయ నాయకులు, సిని హీరోల కారు నెంబర్ తమకు కూడా ఉండాలి అనే ఆసక్తితో ఎంతో మంది లక్షలు, వేలు పోసి కొనుగోలు చేయడం విశేషం. దీనితో రవాణా శాఖ కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫ్యాన్సీ నెంబర్లను విడుదల చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news