మూడో టీ20: టాస్ గెలిచిన న్యూజిలాండ్.. బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

-

ఒకరిది సిరీస్‌ కోసం పోరాటమైతే.. మరొకరిది పరువు కోసం ఆరాటం. టీమిండియా-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న మూడో టీ20ల్లో ఇరుజట్ల పరిస్థితి విభిన్నం. వరుస విజయాలతో కోహ్లి సేన జోరుమీదుండగా.. స్వదేశంలో రెండు వరుస పరాజయాలతో కివీస్‌ సతమతమవుతోంది. అయితే ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ మైదానంలో ఇటీవల జరిగిన రెండు మ్యాచుల్లోనూ టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జరుగుతోన్న నేటి మ్యాచ్‌ కూడా గెలిస్తే కప్ సొంతమవుతుంది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియాలో ఎటువంటి మార్పులు లేవు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, దుబే, మనీశ్ పాండే, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, ఛాహల్, షమీ, బుమ్రా ఉన్నారు. ఈ మ్యాచ్‌లోనూ టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. కనీసం మూడో మ్యాచ్‌లోనైనా గెలవాలన్న కసితో న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌ ఆడుతోంది. అయితే మొద‌ట బ్యాటింగ్‌కు దిగిన రోహిత్‌.. మూడు సిక్సులు, ఐదు ఫోర్ల‌తో పాటు 6 ఓవర్లో బెన్నెట్ బౌలింగ్‌లో 28 పరుగులు సాధించి హాఫ్ సెంచ‌రీ చేశాడు. ఇక 7 ఓవర్లు ముగిసేసరికి 77 పరుగులు వ‌ద్ద నిలిచి ఆదిలోనే న్యూజిలాండ్ వాళ్ల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news