గూగుల్‌ సెర్చ్‌ డార్క్‌మోడ్‌ ఇలా సెట్‌ చేసుకోండి!

-

ఇప్పటి వరకు మనం వాట్సాప్‌లో డార్క్‌ మోడ్‌ ఆప్షన్‌ను వాడుకోగలుగుతున్నాం. ఇప్పుడు ఈ డార్క్‌మోడ్‌ ఫీచర్‌ గూగుల్‌ సెర్చ్‌ కూడా అందుబాటులోకి తీసుకురానుంది. యూజర్స్‌కు ఎప్పటికప్పుడు కొత్త అనుభూతులను పరిచయం చేసేందుకు గూగుల్‌ ప్రయత్నిస్తూనే ఉంటుంది.


గూగుల్‌ ఇది వరకే మొబైల్‌ యాప్స్, సెర్చింజిన్లలో డార్క్‌ మోడ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్లే స్టోర్‌ నుంచి గూగుల్‌ అసిస్టెంట్‌ వంటి అన్ని యాప్లలో ఈ ఫీచర్‌ను విడుదల చేసింది. తాజాగా డెస్క్‌టాప్‌ సెర్చ్‌ ఇంజిన్‌ వెర్షన్‌ లో కూడా డార్క్‌ మోడ్‌ను పరీక్షిస్తోంది. ఈ ఫీచర్‌ సిస్టమ్‌ థీమ్‌ సెట్టింగ్స్‌తో కలిసి పనిచేయనుంది. ఒకవేళ యూజర్లు సిస్టమ్‌ థీమ్‌ను డార్క్‌ మోడ్‌లో పెట్టుకుంటే, గూగుల్‌ డెస్క్‌టాప్‌ సెర్చ్‌ కూడా ఆటోమేటిక్‌గా డార్క్‌ మోడ్‌కు మారుతుంది. ఇప్పుడు యూజర్లు సిస్టమ్‌ సెట్టింగ్స్‌ను బట్టి డార్క్‌ మోడ్‌ యాక్టివేట్‌ చేసుకోవచ్చు.

డెస్క్‌టాప్‌ వెర్షన్‌ లో డార్క్‌ మోడ్‌ ద్వారా డివైజ్‌ బ్యాటరీని ఆదా చేయవచ్చని గూగుల్‌ తెలిపింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసిన తరువాత అందరికీ అందుబాటులోకి తేనున్నారు. అయితే ఇది యూజర్లకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే వివరాలను గూగుల్‌ ధ్రువీకరించలేదు.

డార్క్‌ మోడ్‌ను ఎలా సెట్‌ చేసుకోవాలి?

ఇప్పుడు ఈ ఫీచర్‌ కొంతమంది యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. వినియోగదారులు డెస్క్‌టాప్‌లో గూగుల్‌ సెర్చ్‌ లేదా వెబ్‌ పేజీని ఓపెన్‌ చేయగానే డార్క్‌ మోడ్‌ అందుబాటులోకి వచ్చిందనే నోటిఫికేషన్‌ కనిపిస్తుంది. దీనిపై క్లిక్‌ చేసి, ఎనేబుల్‌ చేసుకుంటే డార్క్‌ మోడ్‌ యాక్టివేట్‌ అవుతుంది. పేజీ మొత్తం డార్క్‌మోడ్‌లోకి మారిపోతుంది. తిరిగి ఈ డార్క్‌ మోడ్‌ను.. లైట్‌ లేదా సిస్టమ్‌ డిఫాల్ట్‌కు మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది.

మొబైల్‌ యాప్‌లో కూడా డార్క్‌ మోడ్‌ కోసం మూడు ఆప్షన్లు ఉంటాయి. బ్యాటరీ సేవర్‌ మోడ్‌ను ఆన్‌ చేసినప్పుడు యాప్‌ డార్క్‌ మోడ్‌కు మారేలా సెట్టింగ్స్‌ పెట్టుకోవచ్చు. దీంతో పాటు లైట్, డార్క్‌ మోడ్‌ ఆప్షన్లు ప్రత్యేకంగా ఉంటాయి. క్రోమ్‌ మొబైల్‌ యాప్‌ సెట్టింగ్స్‌లో వీటిని మార్చుకోవచ్చు. సెట్టింగ్స్‌లోని థీమ్స్‌ విభాగంలో ఈ మూడు ఆప్షన్లు కనిపిస్తాయి.
ఈ ఫీచర్‌ ఇంకా అందుబాటులోకి రానివారు క్రోమ్‌ సెట్టింగ్స్‌లో ‘ఫోర్స్‌ డార్క్‌ మోడ్‌’ ఆప్షన్‌ ద్వారా ప్రయత్నించవచ్చు. ఇందుకు అడ్రస్‌ బార్‌లో chrome://flagsఎంటర్‌ చేసి ‘dark mode’ అని టైప్‌ చేయాలి. అప్పుడు ఫోర్స్‌ డార్క్‌ మోడ్‌ అనే ట్యాబ్‌ కనిపిస్తుంది. దీన్ని ఎనేబుల్‌ చేసిన తరువాత.. నుం

dark mode, light mode, system default అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిల్లో అవసరమైన దాన్ని ఎంచుకోవచ్చు. క్రోమ్‌ను రీ–లాంచ్‌ చేసిన తరువాత సెట్టింగ్స్‌ యాక్టివేట్‌ అవుతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version