జింకల ఫైట్​ మామూలుగా లేదుగా…

తరుచూ మనం పోరాట సన్నివేశాలు చాలా చూస్తుంటాం. కానీ కొన్ని సార్లు చూసిన పోరాట సన్నివేశాలు మాత్రం వేరే లెవల్లో ఉంటాయి. మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అసలు ఇలా కూడా జరుగుతుందా అని అనుకునేలా చేస్తాయి. ప్రస్తుతం అటువంటి సంఘటన ఒకటి సోషల్​ మీడియాలో వైరల్​ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఏంటీ ఈ అరాచకం అంటూ ట్వీట్లు చేస్తున్నారు. జింకలు రెండు కొట్టుకుంటున్నట్లు ఉన్న వీడియో ఇప్పుడు తెగ హల్​ చల్​ చేస్తోంది. ఇలా జింకలు కొట్టుకోవడంపై వాటి యజమాని గే ఇస్బర్ మాట్లాడుతూ…. ఇలా ఆడజింకలు కొటుకోవడం తన జన్మలో చూడలేదని పేర్కొనడం గమనార్హం. ఇంకా ఆమె మాట్లాడుతూ.. ఇలా జింకలు కొటుకుంటున్నపుడు తనకు అవి సేమ్ గ్రహాంతర వాసులుగా కనిపించాయని పేర్కొనడం విశేషం.

ఇలా రెండు ఆడ జింకలు అమెరికా సంయుక్త రాష్ర్టాల్లో ఉన్న టెక్సాస్‌ నగరంలోని సోమర్‌ విల్లే లేక్‌లో కొట్లాడుకున్నాయి. ఇంతకీ అసలేం జరిగిందంటే ఓ ఆడజింక చడీ చప్పుడు చేయకుండా ఒంటరిగా గడ్డి మేస్తూ ఉంది. అదే సమయంలో అక్కడకు మరో ఆడజింక రావడంతో వాటి మధ్యన గొడవ స్టార్ట్​ అయింది. అసలు వాటి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ  అవి ఒక్కసారిగా కొట్లాడుకునేందుకు సిద్ధం అయ్యాయి. రెండు కాళ్లను గాల్లోకి లేపి మరీ ఒకదాన్ని ఒకటి పొడుచుకున్నాయి. ముందు ఒక జింక తన ముందు కాళ్లను గాల్లోకి లేపగానే తర్వాత ఇంకో జింక తానేం తక్కువ అన్నట్లు తాను కూడా యుద్ధానికి సిద్ధమయింది. కొన్ని సెకన్ల పాటు ఇలా జింకలు కొట్లాడుకున్న తర్వాత అక్కడి నుంచి పరుగెత్తాయి.