పెళ్లి జరుగుతుండగా.. పెళ్లి కూతురును కాల్చేశాడు..!

-

పెళ్లి అనేది చాలా ఆనందంగా జరుపుకోవాల్సిన వేడుక. కానీ.. ఓ యువకుడి అతి కారణంగా ఆ పెళ్లి వేడుక విషాదంగా మారింది. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకున్నది.

పూజ అనే 19 ఏళ్ల యువతి పెళ్లి జరుగుతున్నది. బంధువులంతా సందడి చేస్తున్నారు. అంతా ఉత్సాహంగా ఉన్నారు. పంతులు మంత్రాలు చదువుతున్నాడు. పెళ్లి వేడుకల్లో గన్ ను పైకి కాల్చుతున్నారు. ఇంతలో పెళ్లి వేడుకకు వచ్చిన ఓ యువకుడు గాల్లో పేల్చుతున్న తూపాకీని తీసుకొని పెళ్లి కొడుకుకు దండ వేయడానికి లేచిన పెళ్లి కూతురును కాల్చేశాడు. దీంతో పెళ్లి కూతురు కాలుకు గాయమైంది. తనకు తీవ్రంగా రక్త స్రావం అవుతుండటంతో పెళ్లి కూతురును వెంటనే సమీపంలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

పెళ్లి కూతురు కొంచెం కుదుటపడగానే.. వెంటనే మళ్లీ పెళ్లి మండపానికి వచ్చి ఆ నొప్పితోనే తను మెచ్చిన వరుడిని పెళ్లి చేసుకుంది. కాల్పులకు గురయినా కూడా… శరీరం సహకరించకున్నా… అవేమీ పట్టించుకోకుండా పెళ్లి చేసుకోవడంపై ఆ యువతిని బంధువులు, స్థానికులు తెగ పొగుడుతున్నారు. ఇక.. పెళ్లి కూతురును కాల్చి పారిపోయిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతడు ఎందుకు పెళ్లి కూతురును కాల్చాడు.. అతడి ఉద్దేశం ఏంటి.. అనే ప్రశ్నలకు సమాధానం నిందితుడు దొరికితేనే తెలుస్తాయని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version