మృతి చెందిన గర్భిణికి ఆపరేషన్ చేసి.. బిడ్డను బయటకు తీశారు..

-

కరడు గట్టిన నేరగాళ్లను సైతం కంట తడి పెట్టింటే మానవీయ కథనం ఇది. రోడ్డుప్రమాదాలు ఎన్నో ప్రాణాలను బలికొంటున్నాయి. ఆధునిక రహదారులపై ప్రమాదాల ఘోష నిత్యకృత్యమైపోయింది. ఇదీ కూడా ఇలాంటి రోడ్డు ప్రమాద ఘటనే.. ఖమ్మం జిల్లా గొల్లగూడెం వద్ద జరిగిందీ విషాదం. రోడ్డు పక్కనే ఉన్న సాగర్‌ కాల్వలో కారు పడి ఇద్దరు మహిళలు మృతి చెందారు.

చనిపోయిన వీరిద్దరూ అత్తాకోడళ్లు పోగుల ఇందిర, పోగుల స్వాతి. మృతులు మహబూబాబాద్ జిల్లా చినగూడూరు మం. జయ్యారం వాసులు. వీరితో పాటు వస్తున్న స్వాతి భర్త మహిపాల్ మాత్రం బతికాడు.. కారు అద్దాలు పగలగొట్టుకుని బయటపడ్డాడు. ఈ ప్రమాదంలో మరణించిన మహిపాల్‌ భార్య స్వాతి నిండు గర్భిణి. ఖమ్మం ఆస్పత్రిలో చెకప్ కోసం వచ్చి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు రివర్స్ చేసే సమయంలో కాల్వలోకి పడిపోయింది.

అయితే నిండు గర్భిణి కడుపులోని బిడ్డను బ్రతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నం కంటతడి పెట్టించేలా ఉంది. బిడ్డ బతికే ఉండొచ్చన్న ఆశతో భార్య చనిపోయినా వారసుడైనా బతికి ఉంటాడన్న చిన్న ఆశతో మహిపాల్ మళ్లీ భార్య, తల్లి శవాలతో ఖమ్మం వచ్చాడు. ప్రమాదంలో మృతి చెందిన గర్భిణీ స్వాతికి వైద్యులు ఆపరేషన్‌ చేసి బిడ్డను బయటకు తీశారు. అయితే ఇంత ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. స్వాతి కడుపులోని శిశువు అప్పటికే చనిపోయాడు. కనీసం బిడ్డనైనా బతికించుకుందామనుకున్న మహిపాల్ ఆవేదన అందరినీ కంట తడి పెట్టించింది.

Read more RELATED
Recommended to you

Latest news