వైరల్‌ వీడియో: దెయ్యం ఐస్‌క్రీమ్‌.. వీళ్ల థాట్స్‌ ఏంట్రా మరీ ఇలా ఉన్నాయి..!!

-

ఈరోజుల్లో వ్యాపారం చేయాలంటే..పెట్టుబడి మాత్రమే ఉంటే సరిపోదు.. బుర్రకూడా ఉండాలి. క్రియేటివ్‌గా ఆలోచిస్తేనే.. జనాల కంట్లో పడతాం.. అందుకే చాలా మంది.. షాపు పేరు నుంచి ఫర్నీచర్‌ వరకూ అన్నీ కొత్తగా వింతగా ఉండేలా చూసుకుంటున్నారు. అలాగే వారు తయారు చేసే ఉత్పత్తులు కూడా ఆకర్షణీయంగా ఉండాలి.. అప్పుడే కస్టమర్స్‌కు నచ్చుతుంది. ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఒక వీడియో వైరల్‌ అవుతోంది.. అది దెయ్యం ఐస్‌క్రీమ్‌.. చూసేందుకు అచ్చం పిల్ల దెయ్యంలా ఉంటుంది.

వేసవి ప్రారంభం కావడంతో ఐస్‌క్రీమ్‌కు డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. రోజుకు ఒక్కసారైనా ఐస్ క్రీం తింటారు. ఇక్కడ ఐస్ క్రీం రుచికే కాదు, దాని ఆకృతికి కూడా ప్రాధాన్యత ఉంటుంది. టేస్ట్ ఎంత బాగున్నా, టేస్ట్ ఆకర్షనీయంగా ఉంటేనే తినాలనిపిస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ఐస్ క్రీమ్ డిజైన్ అందరి దృష్టిని ఆకర్షించింది. అది చూసి తినాలా వద్దా అనే సందేహం కలుగుతోంది.

 

View this post on Instagram

 

A post shared by creepycum (@creepycum)


ఐస్ క్రీం చూడగానే తినాలనిపిస్తుంది. అయితే ఈ ఐస్‌క్రీమ్‌ని చూడగానే తినాలని కాకుండా భయం పుడుతుంది. ఎందుకంటే ఈ ఐస్‌క్రీమ్‌లో చిన్న
పిల్ల ముఖంలా ఉండి భయం ఉంటుంది. ఈ ఐస్ క్రీమ్ వీడియో, ఫోటో @creepycum ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఇది ఐస్‌క్రీమ్ కోన్, క్రీమ్‌కు బదులుగా, దానిపై పిల్లల భయానక ముఖాలను చూడవచ్చు. బట్టతల ఉన్న పిల్లలు పెద్ద కళ్ళు కలిగి భయానకంగా కనిపిస్తుంది. పిల్లల తలపై ఎరుపు రంగు మరియు చెర్రీ ఉంటుంది. ఇది తినదగిన ఐస్ క్రీమా కాదా అనేది తెలియడం లేదు. అయితే పిల్లల కళ్లు పైకి చూడడం చూస్తే.. దీన్ని చూసి ప్రజలు ఆకలికి బదులు భయపడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ వీడియోకు వుడ్స్ ఆఫ్ టెర్రర్ అనే టైటిల్ పెట్టారు. వుడ్స్ ఆఫ్ టెర్రర్ అనేది USAలోని నార్త్ కరోలినాలోని గ్రీన్స్‌బోరోలో ఒక హాంటెడ్ హౌస్.

ఈ వీడియో టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ సహా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను 1.4 కోట్లకు పైగా వీక్షించారు. ఇలాంటి ఐస్‌క్రీమ్‌ తయారు చేసేవారు క్రూర హృదయులని కొందరు వ్యాఖ్యానించారు. మరొకరు చాలా అసహ్యంగా కనిపిస్తోందని అన్నారు. ఇది పిల్లలకు బాధ కలిగిస్తుందని మరొకరు వ్యాఖ్యానించారు. ఇంతకీ మీకు ఎలా అనిపిస్తుందో.. మీరూ వీడియో చూడండి..!

Read more RELATED
Recommended to you

Latest news