సీఎం జగన్‌ బస్సు యాత్రకు పొటెత్తిన జనం…ఫోటోలు వైరల్‌

-

సీఎం జగన్‌ బస్సు యాత్రకు జనం పొటెత్తారు. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లిలో మేమంతా సిద్ధం బస్సుయాత్రకు పొటెత్తారు జనం. రెండు చోట్ల భారీ గజమాలతో సిఎం జగన్ కు స్వాగతం పలికారు ప్రజలు. బత్తలపల్లిలో రోడ్డుకు రెండువైపులా దారిపొడవునా వేచిచూస్తున్న ప్రజలకు బస్సుపై నుంచి అభివాదం చేస్తున్నారు జగన్. ఈ సందర్భంగా కొంత మంది పేద ప్రజలతో కూడా సీఎం జగన్‌ మాట్లాడారు.

With my star campaigners from Day-5 of the Memantha Siddham Yatra

కాగా…పట్నం నడింపల్లి, కాలసముద్రం, ఎర్ర దొడ్డి మీదుగా కుటగుళ్ల వద్ద మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు సీఎం జగన్‌. కదిరి పట్టణం చేరుకుని పి వి ఆర్ ఫంక్షన్ హాల్ లో మైనారిటీ సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు లో పాల్గొననున్నారు సిఎం జగన్. అనంతరం మోటుకపల్లె మీదుగా జోగన్న పేట, ఎస్ ములకలపల్లె, మీదుగా వెళ్లి చీకటిమనిపల్లెలో రాత్రి బస చేస్తారు సీఎం జగన్‌.

 

Read more RELATED
Recommended to you

Latest news