పేద‌లపై అక్క‌సు పెంచుకున్న‌ చంద్ర‌బాబు

-

నిరుపేద‌ల‌కు మంచి చేయ‌డాన్ని అడ్డుకోవ‌డంలో చంద్ర‌బాబునాయుడు ముందుంటారు. గ‌తంలో జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వం పేద‌ల‌కు ఇళ్ళ స్థ‌లాలు ఇస్తుంటే కోర్టుకు వెళ్ళి వాటిని అడ్డుకున్న ఘ‌నుడు ఈ మాజీముఖ్య‌మంత్రి. ఆయ‌న ఎలాగో పేద‌ల‌కు మంచి చేయ‌రు…. చేసే వారి ప్ర‌య‌త్నాల‌ను సైతం అడ్డుకుంటారు. పేద‌ల‌కు పెన్ష‌న్ ఇచ్చే విష‌యంలో త‌న వ‌క్ర బుద్ధిని మ‌రోసారి రుజువు చేసుకున్నారు ఈ బొల్లి బాబు. ప్ర‌తి నెల 1వ తేదీన వాలంటీర్లు ప్ర‌తి ఇంటికి వ‌చ్చిన త‌లుపు త‌ట్టి మీర‌ని పెన్ష‌న్ ఇస్తారు. అయితే వయసుమళ్ళిన పెద్దల పట్ల చంద్రబాబు మళ్ళీ తన అక్కసును వెళ్లగక్కారు. అసలు సంక్షేమం అంటేనే అసహ్యించుకునే చంద్రబాబు ఇప్పుడు సీఎం వైయస్ జగన్ సారధ్యంలోని ప్రభుత్వం చేస్తున్న మంచిని అడ్డుకుంటూ శున‌కానందం పొందుతున్నారు.

ప్రతినెలా మొద‌టి తారీఖున ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంచే వాలంటీర్ల కాళ్లకు కోర్టుల సాయంతో బంధనాలు వేయించారు చంద్ర‌బాబు.కానీ దీనివల్ల వృద్ధులు.. వికలాంగులు.. ఈ మండుటెండల్లో ఎంత ఇబ్బంది పడతారన్నది ఈ వ‌య‌సు మ‌ళ్ళిన చంద్ర‌బాబుకి అర్ధం కావ‌డం లేదు.చంద్రబాబు కుట్రలవల్ల ఇంటివద్దనే పెన్షన్ తీసుకునే అవకాశం కోల్పోయిన వృద్ధులు..వికలాంగులు ఇప్పుడు అయన మీద మండిప‌డుతున్నారు.ఓ వైపు వాలంటీర్ల‌ను త‌న హామీల‌తో మోసం చేస్తూనే మ‌రోవైపు వాళ్ళ సేవ‌ల‌ను అడ్డుకుంటున్నారు. ఆయనకు ఎలాగో చేయడం చేతకాదు.. మంచి చేస్తున్న జగనన్న చేతులను ఇలా ఈసీ నిబంధనలతో కట్టేయ‌డం త‌గ‌ద‌ని చ‌ర్చించుకుంటున్నారు. చంద్రబాబుకు మనసు లేదు… వయసు పెరిగినా బుద్ధి పెరగలేదు అని పెద్దలు శాపనార్థాలు పెడుతున్నారు.

ఈ సంఘ‌ట‌న‌తో చంద్రబాబు వైఖరి పేదలకు వ్యతిరేకం అని మరోమారు అర్థమైంది.వ‌య‌సు పెరిగినా సీఎం కుర్చీపై మ‌మ‌కారం చావ‌డం లేద‌ని, ప్ర‌భుత్వం నుంచి అందుతున్న సాయాన్ని కూడా అడ్డుకుంటున్నారని తిట్టిపోస్తున్నారు. పేదలమీద గెలిచానని చంద్రబాబు అనుకుంటున్నారు ఏమి లాభం… జూదంలో గెలిచినా కౌరవులు కురుక్షేత్రంలో ఓడిపోయారు…ఈ వాస్త‌వం గుర్తెర‌గాల‌ని సూచిస్తున్నారు. అదే విధంగా చంద్రబాబు ఇప్పుడు కోర్టులో గెలిచినా రేపు ఎన్నికల్లో ఖ‌చ్చితంగా ఓడిపోతారని శాప‌నార్థాలు పెడుతున్నారు.చంద్ర‌బాబు ఓట‌మే ల‌క్ష్యంగా ప‌నిచేస్తామ‌ని పెన్ష‌న‌ర్‌లు బాహాటంగా చేప్పేస్తున్నారు.వ‌య‌సు పెరుతోందే త‌ప్ప చంద్ర‌బాబు ఎప్పుడు మార‌తారో ఏంటో…

Read more RELATED
Recommended to you

Latest news