నకిలీ రుద్రాక్షను ఇలా సింపుల్‌గా కనిపెట్టేయొచ్చు తెలుసా..?

-

శివునికి ప్రతిరూపంగా రుద్రాక్షను చాలా మంది ధరిస్తారు. రుద్రాక్షను ధరిస్తే పాజిటివ్‌ వైబ్స్‌ కలుగుతాయని, ఏమైనా దోషాలు ఉన్నా తొలగిపోతాయని, మానసికంగా ప్రశాంతంగా ఉంటారని పండితులు అంటారు. సైన్స్‌ పరంగా చూసుకున్నా.. రుద్రాక్షను వేసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన, రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. అందుకే చాలామంది రుద్రాక్షని ధరించడానికి ఇష్టపడతారు. నకీలం కాలం రాజ్యమేలుుతన్న ఈరోజుల్లో దేన్ని మనం నమ్మలేం.

అన్నీ కల్తీ, నకీలేవే ఉంటున్నాయి. మీరు తిరుమల వెళ్తే రుద్రాక్షలను చాలా సింపుల్‌గా అమ్మెస్తుంటారు. నిజమైనది అని చెప్తారు. ఇంకా చాలా చోట్ల రుద్రాక్షలు విక్రయిస్తుంటారు. వాళ్లు ఏవే జిమ్మిక్కిలు చేసి ఇది నిజమైనదే అని మిమ్మల్ని మోసం కూడా చేస్తారు. అసలు నిజమైన రుద్రాక్షకు, నకిలీ రుద్రాక్షకు తేడా ఏంటి, వాటిని ఎలా గుర్తించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.!

రుద్రాక్షను రెండు రకాలుగా విభజించారు. స్వచ్ఛమైన లేదా నిజమైన రుద్రాక్షని ఇలియోకార్పస్ గానిట్రస్‌గా పేర్కొన్నారు. నకిలీ లేదా భద్రాక్షని ఇలియోకార్పస్ లాకునోసస్ పేరుతో పిలుస్తారు. ఇవి కాకుండా ప్లాస్టిక్ రుద్రాక్షలను కూడా మనం మార్కెట్‌లో చూడవచ్చు. ఈ కారణంగా, రుద్రాక్షను కొనుగోలు చేయ‌డానికి ముందు అది అసలైనదా లేదా నకిలీదా అని సరిగ్గా తనిఖీ చేయాలి. నకిలీ రుద్రాక్ష ధారణ చేయడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనం ఉండదు.

ఎలా గుర్తించాలంటే..

ఆవాల నూనెలో కాసేపు రుద్రాక్షను ముంచడం ద్వారా అది అస‌లైన‌దో కాదో తెలుసుకోవ‌చ్చు. నిజమైన రుద్రాక్ష దాని రంగును కోల్పోదు. అదే నకిలీ రుద్రాక్షను ఆవనూనెలో వేసి కొంత సేపు ఉంచితే ఖచ్చితంగా రంగు పోతుంది.

దీన్ని కనుగొనడానికి మరొక సులభమైన మార్గం.. ఒక గ్లాసు నీటిని తీసుకొని అందులో రుద్రాక్షని ఉంచండి. నీటిలో మునిగితే అది నిజమైన రుద్రాక్ష. మరి నీటిపై తేలితే అది నకిలీ రుద్రాక్ష.

రుద్రాక్ష పూస ఉపరితల రంధ్రాల ద్వారా అసలైనదా, నకిలీదా గుర్తించవచ్చు. అసలైన రుద్రాక్షకు సహజ రంధ్రాలు ఉంటాయి. నకిలీ రుద్రాక్షకు రంధ్రాలు చేస్తారు.

నిజమైన రుద్రాక్షను గుర్తించడానికి మరొక సులభమైన మార్గం ఏమిటంటే, పదునైన వస్తువును తీసుకొని రుద్రాక్షిపై గీయడం. అప్పుడు రుద్రాక్ష నుండి దారం బయటకు వస్తే, అది నిజమైన రుద్రాక్ష.

రెండు రాగి రేకుల మ‌ధ్య రుద్రాక్ష‌ను ఉంచితే వేగంగా తిరుగుతుంది. అదే న‌కిలీది అయితే ఎలాంటి చ‌ల‌నం ఉండ‌దు.

కాబట్టి ఈసారి రుద్రాక్షను తీసుకునేముందు ఇలాంటి పరీక్షలు చేసి తీసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news