తల్లిదండ్రులు పిల్లల విషయంలో జాగ్రత్తలని పాటించాలి. కొన్ని విషయాలు చెప్పడం వలన పిల్లలలో ఇబ్బందులు వస్తాయి. తల్లిదండ్రులు పిల్లల ముందు ఈ విషయాలు మాట్లాడకూడదు. మరి పిల్లల ముందు తల్లిదండ్రులు ఎలాంటి విషయాలు మాట్లాడకూడదు అనే దాని గురించి తెలుసుకుందాం. ఎప్పుడూ కూడా పిల్లలు ముందు ఆర్థిక సమస్యల గురించి కానీ ఆదాయం గురించి కానీ మాట్లాడకూడదు. అలా చేయడం వలన పిల్లలకి అభద్రతాభావం కలగొచ్చు. కాబట్టి పిల్లలు ముందు ఎప్పుడూ కూడా డబ్బులకి సంబంధించిన విషయాలు మాట్లాడకండి.
అలాగే ఇతరుల గురించి చెడుగా మాట్లాడొద్దు. పిల్లలు ముందు ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళ గురించి చెడుగా లేదా నెగిటివ్ గా మాట్లాడకూడదు. అలా చేయడం వలన వాళ్ళ మైండ్ సెట్ మారిపోతుంది. పిల్లలు కూడా ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం వంటివి చేస్తూ ఉంటారు. పిల్లలు ముందు ఇతరులని నిందించడం మంచిది కాదు. అలాగే పిల్లలు చదివే స్కూల్ టీచర్ దగ్గర కూడా తప్పుగా ప్రవర్తించకూడదు. వారి గురించి పిల్లలతో చెడుగా మాట్లాడకూడదు. అలా చేయడం వలన పిల్లలు కూడా టీచర్లని తిట్టడం టీచర్లు చెప్పినట్లు వినకపోవడం ఇటువంటివి చేస్తూ ఉంటారు.
పైగా వారిలో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. మానసిక అభివృద్ధికి ఆటంకం వస్తుంది. పిల్లలు సరిగ్గా చదవట్లేదని మాట వినట్లేదని వాళ్లు ముందు ఇతరులతో చెప్పకూడదు. ఇది కచ్చితంగా వాళ్ళ ఆలోచనను ప్రభావితం చేస్తుంది. వాళ్లు బాధపడతారు కూడా ఇతరులు కంటే తక్కువ లేదా తమ స్థాయి ఇతరులు కంటే తక్కువ అని భావించే ప్రమాదం ఉంటుంది. పిల్లల ముందు భాగస్వామితో గొడవ పడడం వాగ్వాదం చేయడం వంటివి కూడా మంచివి కావు ఈ పొరపాట్లు ఎట్టి పరిస్థితుల్లో పిల్లల ముందు చేయకుండా చూసుకోండి లేదంటే పిల్లలపై చాలా ప్రభావం పడుతుందని గుర్తుపెట్టుకోండి.