మీ ప్రేయసిని ఆనందంగా ఉంచాలంటే ఇలా చెయ్యండి..!

-

ప్రతి ఒక్కరికి కూడా ప్రేయసిని భార్యని ఆనందంగా చూసుకోవాలని ఉంటుంది. ఎన్నో పనుల్లో మునిగిపోయినా సరే రిలేషన్షిప్ ని పాడు చేసుకోకూడదని ఆనందంగా ఉండాలని అందరూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు కూడా మీ ప్రేయసిని ఆనందంగా ఉంచాలని అనుకుంటున్నారా..? అయితే తప్పకుండా వీటిని ఫాలో అవ్వండి.

ప్రతిరోజు ఉదయాన్నే బాగోగులు అడగండి:

ఉదయాన్నే గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పంపించి వారి యొక్క యోగక్షేమాలని అడగండి ఇలా వాళ్ళని అడగడం వల్ల ఎంతో అందంగా వాళ్ళు ఉంటారు. పైగా మీరు వాళ్ళ కోసం కేర్ చేస్తున్నారని వాళ్ళకి తెలుస్తుంది.

నచ్చిన బ్రేక్ఫాస్ట్ ని పంపించడం:

వారికి నచ్చిన బ్రేక్ ఫాస్ట్ ని పంపించడం లేదా వారి కోసం స్వయంగా చేసి తీసుకు వెళ్లడం లాంటివి చేస్తే కూడా వారు ఆనందంగా ఫీల్ అవుతారు అలానే మీపై ఇష్టం మరింత ఎక్కువ అవుతుంది.

పూలని పంపండి:

అందరికీ పూలు అంటే బాగా ఇష్టం ఉంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళకి పూలు అంటే ఎంతో ఇష్టం. మీరు బాగా దూరంగా ఉంటున్నట్లుయితే అప్పుడప్పుడు పూలను పంపిస్తూ ఉండండి. వాళ్లు వీటిని చూసి ఫిదా అవుతారు పైగా మిమ్మల్ని బాగా ఇష్టపడి ఆనందంగా ఉంటారు.

సర్ప్రైజ్ చేయండి:

అప్పుడప్పుడూ సర్ప్రైజ్ చేయడం వల్ల కూడా వాళ్లు మిమ్మల్ని ఇష్టపడుతూ ఉంటారు సర్ ప్రైజ్ చేయడం వల్ల వాళ్ళు ఫిదా అయ్యిపోతారు. ఇష్టం కూడా అవుతుంది.

లేట్ నైట్ రైడ్స్ లేదా టూర్:

చాలామందికి ఇవి కూడా ఎంతో ఇష్టం ఉంటుంది. లేట్ నైట్ రైడ్ లేదా చిన్న చిన్న టూర్ లు వేయడం వల్ల కూడా వాళ్ళు ఆనందంగా ఉంటారు.

భరోసా ఇవ్వండి:

మీరు వాళ్ళని ఎంతగా ఇష్టపడుతున్నారో చెప్పండి. భరోసా ఇవ్వండి. చాలా మంది మహిళలు తమ యొక్క ప్రియుడు జీవితాంతం తోడుగా ఉంటారా లేదా అని పదేపదే ఆలోచించి ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళకు క్లారిటీ ఇస్తే ఎంతో ఆనందంగా వాళ్ళు ఉంటారు. చూశారు కదా ప్రేయసి ని ఎలా ఆనందంగా ఉంచాలనేది మరి వీటిని అనుసరించి మీ ప్రేయసిని కూడా మరింత ఆనందంగా ఉంచండి.

Read more RELATED
Recommended to you

Latest news