ఆ న‌క్ష‌త్రాలు నిజంగానే గ్ర‌హాంత‌ర వాసులకు చెందిన‌వేనా..?

ఈ సృష్టిలో ఏది జ‌రిగినా దానికి ఓ బ‌ల‌మైన కార‌ణం ఉండే ఉంటుంది. ఇక ఇలాంటి వింత ఘ‌ట‌న‌లు అనేవి ప్ర‌స్తుతం అనేకం జ‌రుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు జ‌రిగిన ఓ ఘ‌ట‌న అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ భూ ప్రపంచంలో ఎన్నో వింత ఘ‌ట‌న‌ల‌పై ఇప్ప‌టికే అనేక పరిశోధనలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయ‌ని చెప్పాలి. ఇలాంటి అనేక ప్ర‌యోగాల ద్వారా ఎన్నో కొత్త విషయాలు నిత్యం బయటపడుతూనే ఉన్నాయ‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

రీసెంట్ గా అమెరికాలో ఉన్న ఓ ప్రయోగశాల ఎప్పుడూ గ‌గ‌న‌త‌లంపై ప‌రిశోధ‌న‌లు చేస్తూనే ఉంటుంది. ఇందులో ఉన్న శాస్త్ర‌వేత్త‌లు వరుసగా ఆకాశాన్ని వీడియోలు, ఫొటోలూ తీస్తూ ఉండ‌గా ఓ వింత ఘ‌ట‌న క‌నిపించింది. అదేంటంటే ఒకచోట 9 వింత నక్షత్రాలు కనిపించిన వెంట‌నే ఒక అరగంట తర్వాత ఆటోమేటిక్ గా మాయం కావ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. అయితే వాస్త‌వానికి ఈ ఫొటోలో తీసింది 1950వ‌ సంవత్సరంలో ఏప్రిల్ 12ర అని తెలుస్తోంది.

కాగా ఆ ఫొటోల‌పై పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలకు అనూమ్య‌మైన విష‌యాలు బ‌య‌ట ప‌డ్డాయి. అమెరికాతో పాటు భారతదేశం, స్వీడన్, స్పెయిన్, ఉక్రెయిన్ లాంటి దేశాల‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ ఫొటోల‌పై విప‌రీతంగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు ఇంకా కూడా. అయితే అరగంట మాత్రమే ఆకాశంలో క‌నిపించి ఆ త‌ర్వాత మాయ‌మైన 9 వింత నక్షత్రాలు వాస్త‌వానికి గ్రహాంతర వాసుల నౌకలుగా సైంటిస్టులు తేలుస్తున్నారు. వారికి చెందిన ఓడ‌లుగా ఆ ఫొటోల్లోని న‌క్ష‌త్రాలు క‌నిపిస్తున్న‌ట్టు చెప్ప‌డం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.