మీ ఇంట్లో కూడా వృద్ధులు ఉన్నారా..? ఇలా చేస్తే.. ఆనందంగా వుంటారు..!

-

ఈరోజుల్లో చాలా మంది పెద్ద వాళ్ళకి దూరంగా ఉంటున్నారు సిటీస్ కి వెళ్ళిపోయి పెద్దలకి దూరంగా ఉంటున్నారు. కానీ ఇంకా అక్కడక్కడ ఉమ్మడి కుటుంబాలు ఉంటున్నాయి మీ ఇంట్లో కూడా వృద్ధులు ఉన్నారా..? అయితే వాళ్ళ ఆనందం కోసం ఇలా చేయండి ఈ విధంగా మీరు చేశారంటే కచ్చితంగా వాళ్ళు ఆనందంగా ఉంటారు. చాలామంది ఇళ్లల్లో ఏం జరుగుతుందంటే పెద్దవాళ్లు బంధువులకి మొదలైన వాళ్ళకి తప్పుగా చెప్తూ ఉంటారు ఒకవేళ కనుక అలా జరిగితే వాళ్లని నిందించడం తిట్టడం వంటివి కాకుండా వాళ్లతో కూర్చుని మాట్లాడండి. ఎందుకు వాళ్ళు బాధపడుతున్నారో కారణం తెలుసుకోండి.

కొన్ని కొన్ని సార్లు పెద్దలు మంచి సలహాలు చెప్తారు కానీ మనం వాటిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము దాంతో వాళ్లకి కోపం వస్తుంది. అలా కాకుండా వాళ్ళు చెప్పేది విని మీకు నచ్చితే దాన్ని చేయండి లేకపోతే ఇగ్నోర్ చూసేయండి ఇలా చేయడం వలన పెద్దలు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పనిలో బిజీ అయిపోయారు అయితే పెద్దలు ఒంటరిగా కూర్చున్నప్పుడు మీరు కాసేపు వాళ్ళతో సమయాన్ని స్పెండ్ చేయండి.

మీ వర్క్ ని కాసేపు పక్కన పెట్టి వాళ్ళతో సమయాన్ని మీరు స్పెండ్ చేస్తే వాళ్ళు ఆనందంగా ఉంటారు వాళ్లకి కూడా తెలియని ఉత్సాహం కలుగుతుంది. మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా ఆనందంగా ఫీల్ అవుతారు. మీ సమస్యల్ని కూడా వాళ్ళతో షేర్ చేసుకోండి అప్పుడు మీకు ఖచ్చితంగా ఉపాయం దొరుకుతుంది ఈరోజుల్లో చాలామంది పెద్దవాళ్ళని లెక్క చేయడం లేదు అలానే బరువుగా ఫీల్ అవుతున్నారు అలా కాకుండా వాళ్లతో ఈ విధంగా మీరు ఫాలో అయితే కచ్చితంగా వాళ్ళు హ్యాపీగా ఉంటారు.

Read more RELATED
Recommended to you

Latest news