ఇండియాలో మొదటి AC రైలు ఎలా ఉండేదో తెలుసా..? చల్లదనం కోసం ఏం చేసేవారంటే..!!

-

ఇప్పుడు రైళ్లలో ఏసీ భోగీలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. ఇందులో కూడా మూడు రకాలు ఉంటాయి. మన బడ్జెట్‌ను, కంఫర్ట్‌ను బట్టి ఎంచుకుంటాం. అసలు భారతదేశంలో ఏసీ భోగీలు ఎప్పుడు వచ్చాయి, మొదట్లో ఏసీ భోగీలు ఎలా ఉండాయో మీకు తెలుసా..?

1934లో దేశ విభజనకు ముందు మనకు స్వాతంత్రం కూడా రావడానికి ముందు భారతదేశంలో మొట్టమొదటి ఏసీ రైలు ప్రవేశపెట్టారు. అప్పట్లో ఉన్న రైళ్లకు ఫస్ట్‌ క్లాస్‌, సెకండ్‌ క్లాస్‌ అని కంపార్ట్మెంట్లు విభజించి ఉంచేవారు. ఫస్ట్ క్లాస్‌లో కేవలం బ్రిటిష్ వారు మాత్రమే ప్రయాణించడానికి అనుమతి ఉండేది. కాబట్టి వారి కోసం చల్లగా ఉన్నటువంటి కోచ్‌లు ఏర్పాటు చేయాల్సిన అవసరం వచ్చిందట. ఈ కారణం వల్ల ఏసీ కోచ్ వ్యవస్థ భారత రైల్వేలో మొదలైంది. ఇందుకోసం పెద్దపెద్ద ఐసు బ్లాక్‌లను రైల్ ప్లోర్‌లోనే ఉంచేవారంట. సెప్టెంబర్ 1 1928, ముంబైలోని బల్లార్డ్ పీర్ స్టేషన్ నుంచి ఢిల్లీ, బటిండా, ఫిరోజ్‌పూర్, లాహోర్ మీదుగా పెషావర్ వరకు వెళ్లి రైలులో దీన్ని అమర్చారు.

ఆ తర్వాత 1930లో ఈ రైలును సహరాన్‌పూర్, అంబాలా, అమృత్‌సర్, లాహోర్‌ ప్రాంతాల మీదుగా వెళ్లడానికి మళ్ళించారు. ఇందులో ముందుగా అమర్చినటువంటి ఐస్ బ్లాక్స్ కారణంగా భోగి మొత్తం చల్లగా ఉండేది. ఈ రైలు పేరు ఫ్రాంటియర్ మెయిల్ అయితే దీనిని 1996లో గోల్డెన్ టెంపుల్ మెయిల్ అని పేరు మార్చారు. ఇది బ్రిటిష్ కాలం నాటి అత్యంత లగ్జరీ రైలుగా బాగా గుర్తింపు పొందినది. అప్పట్లో స్టీమ్‌తో నడిచే ఈ రైలు వేగం సుమారు గంటకు 60 కిలోమీటర్లు.

ప్రస్తుతం ఇది ఎలక్ట్రిసిటీతో నడుస్తోంది దీనికి ఆధునిక హంగులు, ఏసీ వసతులు కూడా కల్పించారు. ఈ రైలు ప్రస్తుతం 1,893 కి.మీల దూరం ప్రయాణించడంతోపాటు 35 రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. 24 కోచ్‌లు ఉన్నా ఈ రైలులో సుమారు 1300 మంది ప్రయాణం చేయవచ్చు. దాదాపు ఈ రైలు 95 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అయినా ఇప్పటికీ ఎంతో దృఢంగా ఉందంటే గొప్ప విషయమే.!

Read more RELATED
Recommended to you

Latest news