మూడు రోజుల నుండి శ్రీలంక మరియు పాకిస్తాన్ జట్ల మధ్యన గాలే వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్ లో పాకిస్తాన్ మొదటి ఇన్నింగ్స్ లో ఆధిక్యాన్ని అందుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక మొదటి ఇన్నింగ్స్ లో 312 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఈ ఇన్నింగ్స్ ధనంజయ డి సిల్వ సెంచరీ (122) చేశాడు.. ఇక పాక్ బౌలింగ్ లో ఆఫ్రిది , నసీం మరియు అబ్రార్ లు తలో మూడు వికెట్లు తీశారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన పాకిస్తాన్ కు ఆదిలోనే శ్రీలంక బౌలర్లు దారుణంగా దెబ్బ తీశారు. ఒక దశలో 100 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో షకీల్ మరియు సల్మాన్ లు చక్కగా ఆడి జట్టును సురక్షితమైన స్థానానికి చేర్చారు. వీరిద్దరూ ఆరవ వికెట్ కు 177 పరుగులు జోడించారు.
ఆ తర్వాత సల్మాన్ (83) అవుట్ అయినా షకీల్ ఒక్కడే టయిలెండర్ ల సాయంతో పాకిస్తాన్ కు మొదటి ఇన్నింగ్స్ లో 149 పరుగుల ఆధిక్యాన్ని అందించాడు. షకీల్ ఒక్కడే చివరి వరకు నిలబడి డబుల్ సెంచరీ 208 సాధించి జట్టును ఆదుకున్నాడు.