పెద్దోళ్లు చెప్తుంటారు.. ఈ జన్మలో పాపాలు చేస్తే వచ్చే జన్మలో ఇంతకింత అనుభివిస్తాం, ఇంకా పేదవాడిగా దిక్కులేనివాడిగా పడుతావు. కాబట్టి వీలైనంత వరకూ మంచి పనులే చేయాలి, మంచి జరగాలనే కోరుకోవాలి అని.. ఈరోజు మనం ఎలాంటి పాపాలు చేస్తే వచ్చే జన్మలో ఎలా పుడతారో తెలుసుకుందాం. ఇవన్నీ జరుగుతాయా మాష్టారు అంటే ఏమో నిప్పు లేనిదే పొగ రాదు కదా.. ఏమత్రం నిజం లేకుండా ఇంత బలంగా జనాలు నమ్మరు..? జరుగుతాయా లేదా అని పక్కనపెడితే జస్ట్ ఫర్ నాలెడ్జ్ అనుకోని చదివేయండి గురూగారు..!!
వివాహేతర సంబంధం:
ఎవరు అయితే ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారో వాళ్ళని నరకలోకంలో బాగా శిక్షిస్తారట. ఆ తరువాత వారు వచ్చే జన్మలో తోడేలుగా, ఆ తరువాత రాబంధుగా, ఆ తరువాత పాముగా, ఆ తరువాత కొంగగా పుడతారు.
పెద్దవారిని గౌరవించక పోవడం:
పెద్దవారిని గౌరవించని వారు వచ్చే జన్మలో కాకిగా పుడతారు. అలా కాకిగా పది ఏళ్లు బ్రతకాలి.
బంగారం దొంగిలించడం:
బంగారాన్ని దొంగతనం చేస్తే వ్యాస మహర్షి చెప్పినట్టుగా వచ్చే జన్మలో కీటకంగా పుడతారు. ఒకవేళ వెండిని దొంగతనం చేస్తే పావురంగా పుడతారు.
ఇతరుల వస్తువులు దొంగిలించడం:
ఇతరుల వస్తువులను దొంగతనం చేస్తే వచ్చే జన్మలో చిలుకగా పుడతారట. అలా వారి జీవితాంతం వరకు పంజరంలోనే ఉండాల్సి వస్తుంది.
ఇతరులను చంపడం:
ఇతరులను చంపితే వచ్చే జన్మలో గాడిదగా పుడతారు. వాళ్ళు జీవితాంతం వారి యజమానికి సేవ చేసుకుంటూ బండెడు చాకిరీ చేస్తూ బ్రతకాలి.
ఇంకా చాలా పాపాలు ఉంటాయి కదా.. వీటి గురించి మాత్రమే చెప్పారంటారేమో.. మిగతా మళ్లీ చూసుకుందాం..! మీరైతే తప్పులు, మోసాలు చేయకుండా హ్యాపీగా లైఫ్‌ను లీడ్ చేయండి! ఒకర్ని మోసం చేస్తే వచ్చే ఆనందం, డబ్బు ఎక్కువ కాలం నిలవదని పెద్దోళ్లు చెప్తారు. అది వందశాతం నిజం అండీ..! ఎవరిమీదైనా కోపం ఉంటే దాన్ని మనసులో దాచుకోని మోయకండి దానివల్ల మీరు ప్రశాంతంగా బతకలేరు. వారిని మీరు పూర్తిగా డిలీట్ చేయండి, వాళ్ల పాపానా వాళ్లే పోతారులే అనుకోని వారి గురించి కనీసం ఆలోచన చేయకుండా మీరు ప్రశాంతంగా బతుకుతారు. ఇగ్నోర్ చేయడం కంటే పెద్ద శిక్ష మరొకటి ఉండదు తెలుసా..? కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి.!