బేబీ సినిమాకు ఓటీటీలో వచ్చేది అప్పుడే..

-

‘బేబి – ది మూవీ’.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా వినిపిస్తున్న పేరు. యువత అంతా థియేటర్లకు బారులు తీరేలా చేసిన కల్ట్ బ్లాక్ బస్టర్.. ఇటీవల కాలంలో ఏ సినిమా కూడా రెండో రోజు బ్రేకీవెన్ సాధించిన దాఖలాలు లేవు. కలర్ ఫోటో సినిమాతో జాతీయ పురస్కారం అందుకున్న రచయిత సాయి రాజేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ మూవీ OTT రిలీజ్ ను మరి కొన్ని రోజులు వాయిదా వేసి.. ఆగస్టు చివరి వారం లేదా,సెప్టెంబర్ తొలివారంలో రిలీజ్ చేయనున్నారని సమాచారం. కాగా ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.బేబీ మూవీ కలెక్షన్స్ వావ్ అనేలా వసూళ్లు సాధిస్తోంది. కేవలం 9 డేస్ లో రూ.60 కోట్లు వసూలు సాధించి సూపర్ హిట్ మూవీ గా దూసుకెళ్తోంది.

Baby Movie Download Telugu Baby Movie Telegram Link in 1080p -  kvsroahmedabad.org

చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ మూవీకు యూత్ ఫిదా అవుతోన్నారు. ఇప్పటికీ కొన్ని థియేటర్ లలో హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అందమైన సన్నివేశాలు, అద్భుతమైన నటన, హృదయాన్ని హాత్తుకునే బలమైన సంభాషణలు, ఎమోషనల్ మ్యూజిక్.. కలిపి  బేబీ సినిమాను అద్భుతమైన దృశ్యకావ్యంగా నిలిపాయి. ఇక బేబీ పాత్రలో నటించిన వైష్ణవి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతుంది అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news