Nails: మీ గోళ్ళు ఈ రంగులో ఉన్నాయా..? ఎంత ప్రమాదమో తెలుసా..?

-

Nails : ప్రతి ఒక్కరూ హెల్తీగా ఉండాలని అనుకుంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు కానీ అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ లక్షణాలు ఉన్నట్లయితే కచ్చితంగా అనారోగ్య సమస్యలు ఉన్నట్లు మీరు తెలుసుకోవచ్చు. మన యొక్క ఆరోగ్యాన్ని మన గోళ్లు చూసి చెప్పుకోవచ్చు. గోళ్లను బట్టి ఎలా మన అనారోగ్య సమస్యల గురించి తెలుసుకోవచ్చు అనేది చూద్దాం.

మీడియం లేదా డార్క్ లైన్స్

చేతి గోళ్లపై మీడియం లేదా డార్క్ కలర్ లో పొడవాటి గీతాలు ఉన్నట్లయితే విటమిన్ బి12 లేదా విటమిన్ డి లోపం అని తెలుసుకోవచ్చు.

తెల్లని గీతలు లేదా స్పాట్స్

చిన్నచిన్న చుక్కలు లేదా గీతలు ఉన్నట్లయితే జింక్ లోపం అని తెలుసుకోవాలి. ఒకవేళ మీ గోళ్ళ పై కూడా ఇలాంటి మచ్చలు గీతలు ఉన్నట్లయితే జింక్ లోపం అని తెలుసుకొని జింక్ లోపాన్ని తగ్గించుకోవాలి.

గోళ్లు విరిగిపోవడం

మీ గోళ్లు పదేపదే విరిగిపోతున్నట్లయితే అది క్యాల్షియం లోపం అని తెలుసుకోవాలి. అలాగే బయోటిన్ కూడా తక్కువగా ఉన్నట్లు అర్థం. గోళ్లు పెళుసుగా ఉంటె కూడా బయోటిన్ లేదా క్యాల్షియం లోపమని తెలుసుకోవాలి.

పసుపు రంగులో గోళ్లు

మీ గోళ్లు పసుపు రంగులో ఉన్నట్లయితే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. స్మోకింగ్ చేసే వాళ్ళ గోళ్లు పసుపు రంగులో మారే అవకాశం ఉంటుంది.

తెల్లని గోళ్లు

గోళ్లు తెల్లగా ఉన్నట్లయితే లివర్ లేదా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని అర్థ. ఒకవేళ మీ గోళ్లు కూడా తెల్లగా మారినట్లయితే డాక్టర్ని కన్సల్ట్ చేయడం మంచిది.

గోళ్లు ఉబ్బడం

మీ గోళ్లు ఒక్కసారిగా ఉబ్బినట్లయితే ఆక్సిజన్ బ్లడ్ లో సరిగా లేదని దాని వెనుక అర్థం ఊపిరితిత్తులు, లివర్ లేదా గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని మీరు అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఈ సమస్యలు ఉంటే కూడా డాక్టర్ ని కన్సల్ట్ చేయండి.

Read more RELATED
Recommended to you

Latest news