Plastic bottle lids : మనం పడేసే ప్లాస్టిక్ బాటిల్స్ క్యాప్స్ ఇంత నష్టాన్ని కలిగిస్తున్నాయా..?

-

Plastic bottle lids: ప్లాస్టిక్ వాడకం మంచిది కాదని ప్రచారాలు చేస్తున్నా కూడా మార్పు రావట్లేదు. ప్లాస్టిక్ బాటిల్స్ వలన ఎన్నో నష్టాలు కలుగుతాయి అని మీకు తెలుసా..? ప్లాస్టిక్ బాటిల్స్ ఏ కాదు ప్లాస్టిక్ బాటిల్ యొక్క మూతలు కూడా చాలా సమస్యలను కలిగిస్తున్నాయి. చిన్నగా ఉండే ఈ క్యాప్స్ పెద్ద ప్రమాదాన్ని కలిగిస్తున్నాయి, చాలామంది కూల్ డ్రింక్స్ కి కూడా అలవాటు పడిపోయారు, కూల్ డ్రింక్ బాటిల్స్, వాటర్ బాటిల్ క్యాప్స్ ని తరచూ మనం పడేస్తూ ఉంటాము. సముద్రాల్లోకి కూడా అవి వెళ్లే అవకాశం ఉంటుంది.

యూరప్ బీచ్లలో కనిపించే ప్లాస్టిక్ వ్యర్ధాలలో ఎక్కువగా ప్లాస్టిక్ మూతలు కనిపించాయి. ఈ క్యాప్స్ చిన్నగా ఉంటాయి. కాబట్టి రీసైక్లింగ్ చేస్తున్నప్పుడు కూడా అవి బయటకే వచ్చేస్తూ ఉంటాయి తప్ప రీసైక్లింగ్ అవ్వవు అని ఆర్థిక నిపుణుడు వెల్లడించారు. రెండు అంగుళాల కంటే చిన్న వస్తువు ఈ స్క్రీనింగ్ ప్రక్రియలో నష్టపోయే ప్రమాదం ఉంటుందట. ఈ చిన్న మూతలు తాబేళ్లు, సముద్రంలో ఉండే పక్షులు, వన్యప్రాణాలకు ప్రమాదంగా మారాయని నిరూపించబడింది.

దురదృష్టవశాత్తు ఇవి ఆహార పదార్థాలనుకుని జంతువులు పక్షులు తినేస్తున్నాయి. సీస్ ఎట్ రిస్క్ అనే ఎన్జీవో ద్వారా సముద్రపు చెత్తలో మొదటి 5 అత్యంత హానికరమైన వాటిల్లో ప్లాస్టిక్ మూతలు ఉండడం షాకింగ్ గా ఉంది. దీంతో చాలా కంపెనీలు కొత్త రకమైన మూతలని తయారు చేయడం మొదలుపెట్టాయి. అలాగే కొంతమంది రీసైకిలింగ్ ప్రక్రియలో మార్పు చేస్తే మంచిదని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఉపయోగించే బాటిల్స్ కొంచెం తక్కవ ధరలో ఉంటాయి.

అదే ఒకవేళ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మార్పు చేయాల్సి వస్తే కొంచెం ఖరీదుతో కూడుకున్నది అని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏదేమైనాప్పటికీ ప్లాస్టిక్ కవర్లు, ఇలాంటి చిన్న చిన్న క్యాప్స్ వంటివి జంతువులకి ప్రక్షులకి ప్రమాదకరంగా మారుతున్నాయి. సముద్ర జీవుల గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి మీరేమంటారు..? ఎలా కంట్రోల్ చెయ్యచ్చో మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news