తెలంగాణలో 3,500 ఏళ్లనాటి సమాధులు

-

సాధారణంగా పురాతన సమాధులు దాదాపుగా 500–1000 ఏళ్లవి ఉంటాయి. అవి కూడా విదేశాల్లో భారీ తవ్వకాల్లో వెలువడిన తర్వాత వాటికి ప్రాముఖ్యత వెలువడుతుంది. కానీ మన తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లోనే దాదాపుగా 3, 500 సంవత్సరాల పురాతన కట్టడాలు, సమాధులు ఉన్నావి. హైదరాబాద్‌లోని కట్టడాలకే కాక విదేశీయులు, పర్యటకులు పురాతన సమాధుల చరిత్ర తెలుసుకునేందుకు పల్లే ప్రాంతాల్లో ఉన్న పురానత సమాధులను సందర్శిస్తుంటారు. అవేక్కడో మనం తెలుసుకుందా..

ములుగు జిల్లాలో..

దేశంలోనే ఎక్కడ లేని విధంగా కంబోడియా నిర్మాణ శైలిలో రూపుదిద్దుకున్న దేవాలయం ఇది. శిల్పంలోని పలు భాగాలను రాతి ఇటుకలపై చెక్కి, వాటిని పొందికగా పేర్చడంతో శిల్పానికి పూర్తి ఆకృతిని తీసుకొచ్చారు. కేవలం రాళ్లతో 35 అడుగుల ఎత్తుతో తీర్చిదిద్దిన మందిరమిది. ములుగు జిల్లా కేంద్రానికి 20 కి.మీ. దూరంలో కొత్తూరు గ్రామ అడవిలో గుట్టపై ఉంది. నిర్మాణం మొత్తం బుద్ధుడి జాతక కథలలోని చిత్రాలను ప్రతిబింబిస్తున్నందున ఇది బౌద్ధ నిర్మాణమని తెలుస్తోంది.

నారాయణపేట జిల్లా..

3 వేల ఏళ్లనాటి ఖగోళ పరిశోధనశాలస్టోన్‌ హేంజ్‌.. బ్రిటన్‌లో ఆదిమానవులు వృత్తాకారంలో ఏర్పాటు చేసిన రాతి నిర్మాణం. దీన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించింది. నారాయణపేట జిల్లా కృష్ణా తీరం వెంట ఉన్న ఇది 3 వేల ఏళ్లనాటి ఖగోళ పరిశోధనశాల అని హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీ ప్రొఫెసర్‌ పుల్లారావు తేల్చారు. రుతుపవనాలు, గ్రహణాల ఆవిర్భావం గుర్తించేందుకు దీన్ని వినియోగించేవారట. ఇక్కడ 10 – 17 అడుగుల ఎత్తున్న గండ శిలల నీడలే వారికి ప్రధాన ప్రమాణం.

సూర్యపేటలో..

బుద్ధుని జీవితం ఆ శిల్పాల్లో నిక్షిప్తమైంది. అక్కడి శిల్పాలు సున్నపు రాతిపై రూపాలకు ప్రాణం పోసిన తీరు అబ్బురపరుస్తాయి. దేశంలోనే అతిపెద్ద బోధిసత్వుడి సున్నపురాతి విగ్రహం లభించిందిక్కడే. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం ఫణిగిరిలో ఎత్తయిన గుట్టపై దీన్ని నిర్మించారు. శాతవాహనుల కాలంలో క్రీ.పూ. ఒకటో శతాబ్దిలోనే రూపుదిద్దుకుంది. ఇక్కడ జరిపిన తవ్వకాల్లో అద్భుతమైన శిల్పసంపద వెలువడింది. కొన్ని హైదరాబాద్‌ సహా వివిధ ప్రాంతాల్లో మ్యూజియంలలో ఉండగా, సింహభాగం శిల్పాలు ఆ ఊరిలోని ఓ పాత ఇంట్లోనే ఉండిపోయాయి.

ఖమ్మం, భూపాలపల్లి జిల్లాలో.

దాదాపు 15 టన్నుల బరువుండే భారీ రాయి దానికిందే రాళ్లతో పేర్చిన గూడు.. దానికి ఓ ద్వారం.. ఇది ఓ నిర్మాణం. ఇది ఓ సమాధిని తెలిపేలా దాని ముందు మానవాకృతి రాతి శిల్పం. ఇలాంటివి కొన్ని వేలు ఉన్నావి. ఓ ప్రాంతంలో ఇన్ని సమాధులుండటం ప్రపంచంలో మరెక్కడా లేవు. అమెరికాలోని శాండి యోగో విశ్వవిద్యాలయం సహా పలు వర్సిటీలు సాంకేతిక అధ్యయనానికి ఆసక్తి చూపుతుండటం వీటి ప్రత్యేకత. ఈ సమాధుల వయసు దాదాపు మూడున్నర వేల ఏళ్లు. ఇవి ములుగు జిల్లా దామరవాయి, ఖమ్మం జిల్లా జానంపేట, భూపాలపల్లి జిల్లా తాడ్వాయి అడవుల్లోని గుట్టలపై ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news