వండుకూనే ముందు కోడిగుడ్లను కడుగుతున్నారా.. అయితే డేంజరే

-

మన అతిజాగ్రత్తే.. కొన్నిసార్లు లేనిపోని అనర్థాలను తెచ్చిపెడుతుంది. అది అన్నీ వేళలా మంచిది కాదు.. తినే విషయంలో కొన్ని క్లీన్ చేయకుండా ఉండేవి ఉంటాయి. అలాంటివి మీరు అదేపనిగా కడిగితే తప్పే కదా.. అలాంటిది గుడ్లు ఒకటి. గుడ్లు ఆరోగ్యానికి ఎంత మంచివే.. వీటిని క్రమపద్ధతిలో, సరైనా మోతాదుదులో తినకుంటే అంతే చెడ్డవి. స్టోర్ చేసేప్పుడు వీటిని జాగ్రత్తగా పెట్టాలి. ఫ్రిడ్జ్ లో నిర్ధిష్టమైన ప్లేస్ లోనే పెట్టుకోవాలి. చాలామంది గుడ్లు వండుకునేప్పుడు.. వాటిని క్లీన్ చేస్తుంటారు. కానీ ఇలా చేయడం మంచిదికాదట.
 USDA (యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్) ప్రకారం, వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసిన అన్ని గుడ్లను కడగడం పూత పూయడం వంటివి చేస్తారు. దానిని ఇంట్లో మళ్లీ కడిగినప్పుడు, ఈ ప్రక్రియ గుడ్డు ఉపరితలం నుండి ‘క్యూటికల్’ లేదా ‘బ్లూమ్’ అనే సహజ రక్షణ పూతను తొలగిస్తుందట.

గుడ్లు కడిగినప్పుడు ఏం జరుగుతుంది..?

USDA ప్రకారం, పౌల్ట్రీలో గుడ్లను కడిగిన తర్వాత, ఎడిబుల్ మినరల్ ఆయిల్ ఫిల్మ్‌ను పూత పూయడం వల్ల ఎటువంటి బ్యాక్టీరియా గుడ్లను కలుషితం చేయదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇంట్లో మళ్లీ గుడ్డును కడగడం వల్ల.. గుడ్డు లోపల బ్యాక్టీరియాను నెట్టివేస్తుంది, ఎందుకంటే గుడ్డు పెంకు పోరస్‌గా ఉంటుంది. గుడ్డు వినియోగానికి పనికిరాదు.
ఫారమ్-ఫ్రెష్ గుడ్లను కొనుగోలు చేస్తుంటే.. గుడ్డును కడగడం మానేయండి.. కొందరైతే.. సబ్బుతో కడుగుతారు. అలాగే, మీరు సూపర్ మార్కెట్ నుండి గుడ్లు కొంటున్నట్లయితే, గుడ్లు కడగడం ఖచ్చితంగా నివారించండి, ఎందుకంటే ఇది గుడ్లను పాడుచేయడమే కాకుండా ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఇంకా మీరు తప్పదు క్లీన్ చేయాలి అంటే.. వాడేముందు వేడి నీటితో కడుక్కోవచ్చు. అసలు ఎందకు చెప్పండి.. కడగడం.. పగలగొట్టి అయితే ఎలాగో బ్రేక్ చేస్తాం.. బాయిల్ అయితే. వేడి నీళ్లలోనే వేస్తాం.. మధ్యలో ఈ కడిగే కాన్సప్ట్ ను మానుకోవడమే మంచిది కదా..కొందరైతే.. గుడ్డు తెచ్చుకోగానే.. మొత్తం అన్నీ కడిగేసి.. ఆరబెట్టి ఫ్రిడ్జ్ లో పెడతారు. ఇది అస్సలే చేయకూడదంటున్నారు నిపుణులు.

Read more RELATED
Recommended to you

Latest news