ట్యాబ్లెట్లు ఇలా వేసుకుంటున్నారా.. అయితే అవి ప‌నిచేయ‌వు

-

మ‌న‌లో చాలామందికి ఏదైనా జ‌బ్బ‌గానీ లేదా ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తే ట్యాబ్లెట్లే వేసుకోవ‌డం కామ‌న్‌. కానీ చాలామంది ట్యాబ్లెట్ల‌ను చ‌ల్ల‌టి నీళ్ల‌తో క‌లిపి వేసుకుంటారు. అయితే ఆ ట్యాబ్లెట్లు క‌రిగిపోయి ర‌క్తంలో క‌ల‌వ‌డ‌మ‌నేది ఒక్కొక్క‌రిలో ఒక్కో ర‌కంగా ఉంటుంది. ఇక చాలామంది చ‌ల్ల‌టి నీటిలో క‌లిపి వేసుకుంటే ట్యాబ్లెట్లు పెద్ద‌గా ప‌నిచేయ‌వ‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు.

గోరు వెచ్చని నీటితో మాత్రలు వేసుకుంటే బాగా పని చేస్తాయని పలు పరిశోధనల్లో తేలింది. దాదాపు 50 మంది వలంటర్లలో సగం మందికి సాధారణ నీటితో ట్యాబ్లెట్లు వేయించారు. అలాగే మిగిలిన వ‌లంటీర్ల‌కు గోరు వెచ్చని నీటితో క‌లిపి అవే ట్యాబ్లెట్లు వేశారు.

అయితే కొద్ది గంటల తర్వాత ఇలా వేసుకున్న వారంద‌రి రక్త నమూనాలను సేకరించి పరీక్షించ‌గా.. ఆస‌క్తిక‌ర నిజాలు తెలిశాయి. గోరు వెచ్చని నీటితో క‌లిపి ట్యాబ్లెట్లు వేసుకున్న వారిలో ఆ ట్యాబ్లెట్లు త్వ‌ర‌గా ర‌క్తంలో కలిసినట్టు శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. చల్లని నీటితో వేసుకుంటే ట్యాబ్లెట్లు ర‌క్తంలో కరగడానికి చాలా సమయం పడుతుందంట‌. గోరు వెచ్చని నీటితో క‌లిపి వేసుకున్న ట్యాబ్లెట్లు త్వరగా చిన్న పేగులోకి వెళ్లి అక్క‌డ క‌రిగిపోతుంది. అక్క‌డి నుంచి రక్తంలోకి క్షణాల్లో కలుస్తుందట.

Read more RELATED
Recommended to you

Latest news