బాత్ రూమ్ ని శుభ్రం చేసాక కూడా దుర్వాసన వస్తోందా..? అయితే ఇలా చేయండి..!

-

శుభ్రం చేసినా కూడా టాయిలెట్ల నుండి దుర్వాసన వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎంత క్లీన్ చేసినా కూడా ఇంకా దుర్వాసన వస్తుంది ఏంటి అని మనకి చికాకు కూడా వస్తుంది. బాత్రూమ్ ని క్లీన్ చేసిన తర్వాత కూడా దుర్వాసన కలుగుతున్నట్లయితే ఇలా చేయండి. ఇలా చేశారంటే దుర్వాసన రాదు. బేకింగ్ సోడా ని వేసి ఒక టీ స్పూన్ ఎసెన్షియల్ ఆయిల్ వేయండి దేనితోనేనా బాగా మిక్స్ చేసి తర్వాత టాయిలెట్లలో గోడల మీద బాత్రూం అంతా పోసి ఒక గంట సేపు నానబెట్టండి తర్వాత నీళ్లు పోసి క్లీన్ చేసుకోండి.

ఒక బకెట్ నీళ్లలో కొంచెం వెనిగర్ వేసి బాత్రూం శుభ్రం చేసిన తర్వాత వెనిగర్ కలిపిన నీళ్ళని బాత్రూంలో పోసి గంట సేపు నానబెట్టండి. తర్వాత మళ్లీ మంచినీటితో బాత్రూం ని కడగండి ఇలా చేస్తే కూడా వాసన రాదు. టాయిలెట్ నుండి దుర్వాసన వస్తే టాయిలెట్ ఫ్లష్ క్లీనింగ్ బాల్స్ ని ఉపయోగించండి అప్పుడు దుర్వాసన రాదు. వెంటిలేషన్ లేకపోతే కూడా దుర్వాసన కలుగుతుంది ఎగ్జాస్ట్ ఫ్యాన్ ని పెడితే దుర్వాసన మొత్తం బయటికి పోతుంది.

శుభ్రంగా టాయిలెట్లు ఉంటాయి. బాత్రూంలో ఖాళీ సబ్బు కవర్లు చెత్తాచెదారం ఉంటే కూడా దుర్వాసన వస్తుంది వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసేయాలి. ఇంట్లోనే మీరు కావాలనుకుంటే స్ప్రే చేసుకోవచ్చు. పుదీనా ఆకుల్ని నానబెట్టి స్ప్రే బాటిల్ లో వేసి బాత్రూంలో స్ప్రే చేస్తే దుర్వాసన మొత్తం పోతుంది ఇలా ఈ చిన్న చిన్న ట్రై చేస్తే దుర్వాసన పోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news