జులైలో గ్యాస్ ధరల్లో స్వల్ప మార్పులు.. ఎంత ఉన్నాయంటే..?

-

జులై మాసంలో సామాన్యులకు కేంద్ర సర్కార్ కాస్త ఊరట కల్పించింది. ఈ నెలలో వంట గ్యాస్ సిలిండర్ల ధరలను యథాతథంగా ఉంచింది. జులై 1 నుంచి ఈ సవరించిన గ్యాస్​ ధరలు అమల్లోకి వచ్చాయి. గ్యాస్​ ధరలు స్థిరంగా ఉంచినప్పటికీ.. ఆయా రాష్ట్రాల్లోని పన్నులను అనుసరించి గ్యాస్​ సిలిండర్ల ధరల్లో హెచ్చుతగ్గులు ఉండనున్నాయి. ఏ రాష్ట్రంలో ఎంత ధర ఉందంటే..?

దిల్లీలో 14.2 కిలోల ఎల్​పీజీ సిలిండర్‌ ధరలో ఎటువంటి మార్పు లేకుండా రూ. 1,103 వద్దనే ఉంది. మరోవైపు ఆ రాష్ట్రంలో దిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.1,773గానే ఉంది. ముంబయిలో అదే సిలిండర్‌ రూ.8.50 పెరిగి రూ.1,733.50కు చేరింది. కోల్‌కతాలో ఈ సిలిండర్‌పై రూ.20 పెరిగి రూ.1,895కి చేరుకోగా.. చెన్నైలో 19కిలోల సిలిండర్‌ రూ.8 పెరిగి.. రూ.1,945కు అందుబాటులోకి వచ్చింది. అయితే గ్యాస్​ సిలిండర్లలో ఈ ధరల మార్పుకు స్థానిక పన్నులతో పాటు రవాణా ఖర్చులు కూడా ఒక కారణం.

Read more RELATED
Recommended to you

Latest news