జీవితంలో ఎదిగేందుకు సుధామూర్తి చెప్పిన రహస్యాలు ఇవి..!

-

ప్రతి ఒక్కరు కూడా జీవితంలో సంతోషంగా ఉండాలని అనుకుంటారు. ఏ బాధ లేకుండా హాయిగా ఉండాలని అనుకుంటారు. కొంతమంది చెప్పిన విషయాలని మనం లైఫ్ లో పాటిస్తే మన లైఫ్ అంతా కూడా కుష్ గా ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే సమస్యలు, బాధలు ఏమీ కూడా ఉండవు. సుధా మూర్తి గురించి ప్రత్యేకించి పరిచయం చేయక్కర్లేదు. సుధా మూర్తి సక్సెస్ కోసం కొన్ని సీక్రెట్స్ ని చెప్పారు. హ్యాపీగా ఉండాలంటే ఏ మార్గంలో నడిస్తే బాగుంటుందనేది సుధా మూర్తి చెప్పారు.

మరి ఇక ఆమె చెప్పిన విషయాలను చూసేద్దాం. భర్త భార్యకు, భార్య భర్తకి అండగా వుండాలని ఆమె అన్నారు. కుటుంబ వ్యవహారాల్లో ఇద్దరూ కూడా ఒకరికొకరు సాయం చేసుకుంటుంటే లక్ష్యాలను చేరుకోవచ్చు అని ఆమె అన్నారు. వ్యక్తిగతంగా ఆలోచించడమే కాకుండా కుటుంబ ఎదుగుదల గురించి కూడా ఎప్పుడు భార్య భర్తలు ఆలోచించాలి. మనసులో వచ్చే ఆలోచనలు, అభిప్రాయాలను ఎప్పుడు దాచుకోవద్దు. వాటిని పైకి చెప్పుకోవాలి.

అదే విధంగా ఈ రోజుల్లో స్త్రీ పురుషులిద్దరూ ఉద్యోగం, వ్యాపారం చేస్తున్నారు సో ఇంటి పనులు పూర్తిగా మర్చిపోతున్నారు. అలా చేయకూడదు. ఇద్దరు కూడా రెండింటి కోసం టైం ని కేటాయించాలి. మనం చేసే పని వల్ల ఇతరులకి మేలు జరిగేలా వుండాలని కూడా సుధా మూర్తి చెప్పారు. అలానే సుధామూర్తి తనని తాను ఎక్కువగా నమ్మారు. ఆమె కుటుంబాన్ని సమానంగా ప్రేమించారు కూడా. అలా ఆమె తను పనిలో నిమగ్నం అయ్యారు. ఇలా సెల్ఫ్ లవ్ కూడా లైఫ్ లో చాలా అవసరం.

 

Read more RELATED
Recommended to you

Latest news