ఇలా చేస్తే బిస్కెట్లు వంటి ఆహారపదార్ధాలు మెత్తపడిపోకుండా ఉంటాయి..!

-

మనం ఇంట్లో బిస్కెట్లు, చిప్స్ మొదలైన స్నాక్స్ ని దాస్తాము. అయితే ఒక్కోసారి అవి మెత్తబడిపోతూ ఉంటాయి. దీంతో తినడానికి ఎవరూ ఆసక్తి చూపించరు. ముఖ్యంగా వానా కాలంలో చెమ్మకి మెత్తబడిపోతుంటాయి. అలానే పాడైపోతాయి. అయితే ఇటువంటివి పాడైపోకుండా ఉండాలంటే ఈ ఇంటి చిట్కాలు బాగా ఉపయోగపడుతాయి. మరి ఆలస్యం ఎందుకు వీటి కోసం ఒక లుక్కేయండి.

మనం సరిగ్గా స్నాక్స్ ని స్టోర్స్ చేసుకోకపోతే అవి బూజు పట్టేస్తాయి. దీంతో కొన్న డబ్బులు అన్నీ కూడా వృధానే. ఫ్రెష్ గా టేస్టీగా స్నాక్స్ ని ఉంచాలంటే ఈ చిట్కాలు బాగా ఉపయోగపడుతాయి. స్నాక్స్ స్టోర్ చేసేటప్పుడు ప్లాస్టిక్ డబ్బాలు ని అస్సలు వద్దు. చాలా మంది ఎక్కువగా ప్లాస్టిక్ డబ్బాలో ఈ చిప్స్ వంటి వాటిని నిల్వ ఉంచుతారు. అయితే ప్లాస్టిక్ వాటి కంటే కూడా గాజు బాటిల్స్ లో పెడితే పాడైపోకుండా ఉంటాయి కాబట్టి ప్లాస్టిక్ డబ్బాల్లో ఇటువంటి వాటిని దాచుకునే వాళ్ళు మానుకోవడం మంచిది.

డైరెక్టుగా సూర్యకిరణాలు తగలకుండా చూసుకోవాలి. సాధారణంగా మనం బియ్యం వంటివాటిలో తడి పోవాలంటే ఎండలో ఆరబెట్టి ఉంటాము. కానీ బిస్కెట్లు వంటి వాటిని ఎండలో ఆరబెట్టడం వల్ల పాడైపోతాయి. కాబట్టి ఎండలో అస్సలు పెట్టదు. దీనివల్ల పాడైపోతాయి రుచి కూడా ఉండవు.

ఎప్పుడూ కూడా మీరు గట్టిగా మూత పట్టే డబ్బాలలో పెట్టండి. పైగా అన్నిటినీ ఒకే దాంట్లో కలిపి పెట్టద్దు. ఒక్కో ఐటంని ఒక్కో డబ్బాలో పెట్టండి.
ఎయిర్ టైట్ కంటైనర్ ని ప్రిఫర్ చేయండి.
బ్లోటింగ్ పేపర్స్ కూడా ఉపయోగించవచ్చు. దీనివల్ల కూడా అవి పాడవ్వకుండా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news